MLA Raja Singh : బీజేపీలో చేరనే చేరను.. రాజాసింగ్ సంచలన కామెంట్స్..
తెలంగాణ బీజేపీ నాయకత్వం పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ భ్రష్టు పట్టిందని, కొంతమంది నేతల తీరువల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆయన తెలిపారు.