ATM Robbery: ఇలా దోచేశారేంట్రా.. గ్యాస్ కట్టర్‌తో ATM బాక్సా‌ను కట్ చేసి - లక్షల్లో!

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌‌లో దొంగతనం జరిగింది. ఆదివారం లింగగిరి రోడ్డులో ఉన్న SBI ఏటీఎంలో రూ.19.66లక్షలు చోరీకి గురైంది. కొందరు దుండగులు గ్యాస్ కట్టర్‌తో ATM బాక్స్‌ను కట్‌ చేసి డబ్బులు దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
ATM Money stolen

ATM Money stolen

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు డబ్బులు ఎలా దోచేయాలా? అని రకరకాల ప్లాన్‌లు వేస్తున్నారు. అలా ఆలోచించి దొంగతనాల బాట పడుతున్నారు. ఒంటిగా వెళ్తున్న మహిళ బంగారం చోరీ చేయడం, ఇంట్లోకి చొరబడి డబ్బు దోచుకెళ్లడం, డబ్బులు కోసం కిడ్నాప్‌లు చేయడం ఇలా ఒకటేంటి.. చాలానే జరుగుతున్నాయి. 

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

Also Read :  Telangana Formation Day 2025: జీవితమంతా తెలంగాణ కోసమే.. స్వరాష్ట్రం చూడకుండానే కన్నుమూసిన జయశంకర్ సార్!

ATM Robbery

తాజాగా అలాంటిదే మరో ఘటన తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు ఏకంగా ఏటీఎంలో ఉన్న డబ్బునే దోచుకెళ్లారు. ఈ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని లింగగిరి రోడ్డు పక్కన ఒక ఎస్బీఐ ఏటీఎం కేంద్రం ఉంది. అది గమనించిన కొందరు దుండగులు ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు అక్కడికి కారులో వచ్చారు. ఆపై ఏటీఎం కేంద్రంలోకి చొరబడ్డారు. తమతో పాటు తెచ్చుకున్న గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం బాక్స్‌ను కట్ చేశారు. 

Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్‌కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు

అనంతరం అందులో ఉన్న డబ్బును దొంగిలించి.. ఏటీఎం బాక్స్‌ను తగలబెట్టి పరారయ్యారు. ఈ ఘటనతో బ్యాంకు అధికారి హనుమంతరావు, ఏటీఎం ఫైనాన్సియల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి గంగాధర మూర్తి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఏటీఎంలో ఉన్న రూ.19.66 లక్షల డబ్బును దుండగులు దొంగిలించినట్లు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Also Read: బంగ్లాదేశ్‌ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు

 

telugu-news | latest-telugu-news | telangana crime case | telangana crime incident | telangana crime news | telangana-crime-updates | today-news-in-telugu | telugu crime news | latest telangana news | telangana news live updates | telangana news today | telangana-news-updates

Advertisment
Advertisment
తాజా కథనాలు