Telangana: సంచలన అప్డేట్.. తెలంగాణలో 600 మంది ఫోన్లు ట్యాప్
2023 ఎన్నికలకు రెండు నెలల ముందు భారీ సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటిదాకా మొత్తం 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారుల విచారణలో తేలింది.
2023 ఎన్నికలకు రెండు నెలల ముందు భారీ సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటిదాకా మొత్తం 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారుల విచారణలో తేలింది.
నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం గ్రామంలో దారుణం జరిగింది. తండ్రి నర్సయ్య (54) చెడు వ్యసనాలకు బానిసై తరచూ తల్లి నర్సమ్మతో గొడవ పడుతున్నాడని కూతురు అతడ్ని కొట్టి చంపింది. ఆపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం వివరించింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
రేవంత్ జైలుశిక్ష అనుభవించారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకవేళ నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటానని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు.
ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో కేటీఆర్‌పై విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు.
సీఎం రేవంత్ సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూలు కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఫ్రీగా అందించాలనే లక్ష్యంతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం 44వ హైవేపై బీఆర్ఎస్ లీడర్ కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా మామడకు చెందిన మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నేత హరీశ్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తర్వాత ఆయన దుండగుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు.
జూన్ చివరిలోగా స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని ఆయన అన్నారు. మొదట MPTC, ZPTC ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు.
ఆమె పేరు సరిత. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాలో పుట్టి పెరిగారు. రాష్ట్రంలోని TGSRTCలో ఉద్యోగం సంపాదించి తొలి మహిళా బస్‌డ్రైవర్‌గా చరిత్ర సృష్టించారు. మొదటిరోజు MGBS నుంచి మిర్యాలగూడ వరకు నాన్ స్టాప్ బస్ నడిపారు.