/rtv/media/media_files/2025/04/27/RBOdzRYd4lqrk2eYAn5f.jpg)
Heavy rains in Telangana.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదో రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి:Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయాలు
ఏపీలో ఈ జిల్లాల్లో..
నేడు ఏపీ(Andhra Pradesh)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మృత్స్య కారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?
తెలంగాణలో ఈ జిల్లాల్లో..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇది కూడా చూడండి:Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు
#24HrWx
— Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) July 3, 2025
- North and East #Telangana can continue to get widespread light/moderate rain with heavy spells especially during evening time.
- Central #AndhraPradesh can get heavier rains.
- North AP will be overcast and can continue to get light rains.
- #Hyderabad light/moderate… pic.twitter.com/zkMcSKp3Z5