CM Revanth Reddy: మంత్రులకు క్లాస్‌ పీకిన సీఎం రేవంత్, AICC చీఫ్‌ ఖర్గే!

టీపీసీసీ సమావేశంలో తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్, AICC చీఫ్‌ మల్లికార్జున ఖర్గే క్లాస్‌ పీకారు.  మం త్రుల పనితీరుపై సీఎం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని మండిపడ్డారు.

New Update
kharge cm

CM Revanth Reddy: టీపీసీసీ సమావేశంలో తెలంగాణ (Telangana) మంత్రులకు సీఎం రేవంత్, AICC చీఫ్‌ మల్లికార్జున ఖర్గే(AICC Chief Mallikarjun Kharge) క్లాస్‌ పీకారు.  మంత్రుల పనితీరుపై సీఎం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని సీఎం మండిపడ్డారు. ఎవరూ పార్టీ పదవులను తేలికగా తీసుకోవద్దన్నారు.  వాటితోనే గుర్తింపు, గౌరవం లభిస్తాయని చెప్పారు.  అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి కాబట్టి కొత్త నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని పిలుపునిచ్చారు.  

Also Read:రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!

రాష్ట్రంలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ అధికారమని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ . కష్టపడి  పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని చెప్పారు. నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలన్నారు.  గ్రామలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.  సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మల్లికార్జున ఖర్గేను స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకెళ్లాలని సీఎం వెల్లడించారు.  మరోవైపు పలువురు మంత్రులపై ఖర్గే కూడా సీరియస్‌ అయ్యారు.  మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని, ఆచితూచి మాట్లాడాలని చెప్పారు.  ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో గెలవాలని మంత్రులకు ఖర్గే ఆదేశాలు జారీ చేశారు.  విభేదాలు ఉంటే ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లాలని ఖర్గే సూచించారు.  

Also Read: Samantha: అతడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా .. సామ్ కామెంట్స్ వైరల్

Also Read:Mouni Roy: ఆకుపచ్చ చీరలో నడుమందాలు చూపిస్తూ మౌని గ్లామర్ షో! ఫొటోలకు ఫిదా అవ్వాల్సిందే

పొంగులేటి ప్రకటన.. కాంగ్రెస్ పార్టీలో కలకలం 

ఇదిలావుండగా మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి ఇచ్చిన పేపర్ ప్రకటనలు కాంగ్రెస్ పార్టీలో కొత్త కలకలం రేగింది.  పలు పేపర్లకు ఆయన ఇచ్చిన ప్రకటనలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోటో లేదు.  ఇటీవల ఆమె మంత్రి పొంగులేటికి క్లాస్ పీకినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు రాగా ఇప్పుడు ఫోటో లేకపోవడం అందుకు కారణమని తెలుస్తో్ంది. మరోమంత్రి వివేక్ ఇచ్చిన ప్రకటనలలో మీనాక్షి నటరాజన్ ఫోటో ఉంది.

Also Read: కెచప్‌తో రోటీ పరోటా పిల్లలకు ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు