Konda Murali: ఎవరికీ భయపడేది లేదు.. కొండా మురళి సంచలన కామెంట్స్

కొండా మురళి మీడియాతో మాట్లాడారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినని.. ఎవరికీ భయపడేది లేదని తెలిపారు. నాకు నేనుగా ఎవరిపై కామెంట్లు చేయనని.. నా జోలికి వస్తే మాత్రం ఊరుకోని వార్నింగ్ ఇచ్చారు.

New Update
Konda Surekha Sensational Comments on Party leaders

Konda Murali

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొండా దంపతులకు వ్యతిరేకంగా వరంగల్ కాంగ్రెస్ నేతలు ఏకమయ్యారు. మురళిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని అదిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో AICC ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతులు భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై ఆమెకు వివరిస్తున్నారు. దీనికి ముందు కొండా మురళి మీడియాతో మాట్లాడారు. '' నేను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని. ఎవరికీ భయపడేది లేదు. 

Also Read: అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 5గురు మృతి - అందులో నలుగురు చిన్నారులు

Also Read :  పులుల్ని వేటాడే బెబ్బులి.. ‘వీరమల్లు’ విధ్వంసం.. ట్రైలర్ గూస్‌బంప్స్

Konda Murali Comments On Party Leaders

44 ఏళ్ల నుంచి నా ఎపిసోడ్‌ కొనసాగుతూనే వస్తోంది. నాకు నేనుగా ఎవరిపై కామెంట్లు చేయను. నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. కేసులకు భయపడే వ్యక్తిని కాదు. ప్రజల బలంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నాను. నేను బీసీ కార్డు పట్టుకునే బతుకుతున్నాను. పేదల సమస్యలు పరిష్కరిస్తాను కాబట్టే నా దగ్గరికి జనం వస్తారు. కొందరు పనిచేసే వాళ్లపైనే రాళ్లు వేస్తారు. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా కూడా గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని నటరాజన్‌కు చెప్పాను. మా సేవలను పార్టీ వినియోగించుకోవాలని కోరాను. 

Also Read: దారుణం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి డెలివరీ బాయ్ మృతి.. 22వ అంతస్తులో ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి!

కాంగ్రెస్ పార్టీని బతికించడమే నా ఉద్దేశం. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే నా లక్ష్యం. రేవంత్‌ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా చూడాలని ఉంది. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్ గౌడ్‌కు అండగా నిలుస్తాను. శుక్రవారం జరగనున్న సభ గురించి చర్చించాం. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచేలా కృషి చేస్తాను. వరంగల్‌లో ఎమ్మెల్యేలందరినీ మళ్లీ గెలిపించడమే నా బాధ్యత. ఎవరికీ భయపడేది లేదు. నాకు ఎలాంటి గ్రూపు రాజకీయాలతో సంబంధం లేదని'' కొండా మురళి అన్నారు.  

Also Read : 16 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 40 ఏళ్ల స్కూల్ టీచర్

telugu-news | telangana | konda-surekha

Advertisment
Advertisment
తాజా కథనాలు