Telangana: యువకుడి ప్రాణం తీసినా సోషల్ మీడియా పోస్టు!

తెలంగాణలో ఓ యువకుడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని ఓ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. ఆ గ్రూప్‌లో కాస్త వివాదం చెలరేగడంతో కాంగ్రెస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పు లేకుండా కేసు నమోదు చేశారని మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
Tirupati Crime News

Crime News

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల వల్ల ఎందరో ప్రస్తుతం రోజుల్లో బలి అవుతున్నారు. కొందరు వీటిని పట్టించుకోకుండా స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. మరికొందరు పరువు పోయిందని, మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ములుగు జిల్లాల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లాకి చెందిన చుక్కా రమేశ్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు.

ఇది కూడా చూడండి:Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయాలు

తన పోస్టు వల్ల వివాదం..

అయితే ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తెలుసుకుని అధికారులను సంప్రదించాడు. కానీ ఎలాంటి ఫలితం లేదు. దీంతో ఎవరెవరికి ఇళ్లు వచ్చాయని తెలుసుకుని ఆ వివరాలను చల్వాయి సమాచారం అనే గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. దీంతో గ్రూప్‌లో కాస్త వివాదం చెలరేగడంతో కాంగ్రెస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?

ఈ క్రమంలో పోలీసులు రమేశ్ ఇంటికి వెళ్లి ఇలా రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు. ఇలా పోస్టులు పెట్టినందుకు పోలీసులు అతని ఫోన్ తీసుకున్నారని గ్రామస్థులు మాట్లాడుకున్నారు. ఇలా తప్పుడు కేసు తనపై నమోదు చేయడంతో రమేశ్ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని చావుకి కారణమైన వారిని శిక్షించాలని గ్రామస్థులు జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. 

ఇది కూడా చూడండి:Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు

#telangana #mulugu #suicide #Social Media
Advertisment
తాజా కథనాలు