/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
TG news: తెలంగాణ పోలీసులు, పోలీస్ట్ స్టేషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్లు సెటిల్‌మెంట్ అడ్డాలుగా మారాయని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు జారీచేసిన ఇంజంక్షన్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ పిటిషన్లు దాఖలవుతున్నాయని, ఈ తీరును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడానికి వీల్లేదని మండిపడింది. ఇలాంటి సంఘటనలు చూస్తే పోలీస్ స్టేషన్లు సెటిల్‌మెంట్ అడ్డాలుగా మార్చానిపిస్తుందని వ్యాఖ్యానించింది.
Also Read : మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!
ఈ మేరకు హైదరాబాద్ నాగోల్, బండ్లగూడ కృషినగర్‌లో ప్లాట్ నంబర్ 65కు సంబంధించి, నాగోలు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన సివిల్, క్రిమినల్ కేసులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు రూ.55 లక్షలు చెల్లించి పరిష్కరించుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ బాధితుడు సుదర్శనం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పౌర వివాదాలలో పోలీసుల జోక్యానికి తావు లేకుండా డీజీపీ సర్యులర్ జారీ చేయాలని హైకోర్టు సూచించింది. పోలీసులు తమ బలాన్ని ఉపయోగించి ఇంజంక్షన్ ఆదేశాలను ఉల్లంఘించకూడదని స్పష్టంచేసింది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని ఆస్తులను చాలాకాలంగా స్వాధీనంలో ఉందని చెప్పి హకులు కోరడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేస్తూ న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ మౌఖిక ఆదేశాలు జారీచేశారు.
Also Read : తల్లి అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, రెజ్లర్!
ఇక సాధారణ ప్రజలకు నిబంధనల గురించి అవగాహన కల్పించడానికి వాటిని పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, ఆ నిబంధనలను అన్ని పోలీస స్టేషన్లలోనూ ప్రదర్శించాలని ఆదేశించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వర్చువల్‌గా హాజరు కాగా, నాగోల్ సీఐ స్వయంగా హాజరయ్యారు. భూమి సమస్యను పరిషరించడానికి పోలీస్‌స్టేషన్‌ను సెటిల్‌మెంట్ అడ్డాగా మార్చారని హైకోర్టు తప్పుపట్టింది. సీసీ ఫుటేజీ సమర్పించాలని ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.