/rtv/media/media_files/2025/07/04/kcr-and-kavita-2025-07-04-10-50-17.jpg)
KCR and Kavita
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం యశోద ఆస్పత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. గత రెండ్రోజులుగా నిరసంగా ఉండటంతో ఆయన ఆస్పత్రికి వచ్చారు. శుక్రవారం యశోద ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. జ్వరం, మధుమేహ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ని ఆమె పరామర్శించారు. తండ్రి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సీఎం రేవంత్, కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా యశోద డాక్టర్లను ఫోన్ చేసి కేసీఆర్ హెల్త్ అప్‌డేట్ గురించి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఆస్పత్రికి క్యూ కడుతున్నారు.
Also Read: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళా నేతకే.. రేసులో ముగ్గురు
కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని.. సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయని తెలిపారు. మిగిలిన పారామీటర్ల అంతా సాధారణంగా ఉన్నాయని.. ప్రస్తుతం కేసీఆర్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచామని పేర్కొన్నారు. అయితే సీఎం రేవంత్ తీరును బీఆర్‌ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. ఆయనపై మాజీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సంచలన పోస్ట్ చేశారు. రేవంత్‌వి మురికి మాటలు, నిత్య నిందలు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ చావుకోరే మానవత్వం లేని వ్యక్తి రేవంత్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌పై ఏడుపులు, పెడబొబ్బలేనని.. నువ్వా తెలంగాణ అభివృద్ధి స్వప్నికుడివా అంటూ మండిపడ్డారు. మొన్నటివరకు కేసీఆర్ చావు కోరి.. ఈరోజు ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తే మంచొడివి కాదంటూ ఫైర్ అయ్యారు.
Also Read: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. నెలలు నిండకముందే, తక్కువ బరువుతో పుడుతున్న చిన్నారులు