Telangana: ఇంట్లో షార్ట్ సర్క్యూట్.. సజీవ దహనమైన 12 ఏళ్ల బాలిక
నారాయణపేట జిల్లా ముక్తల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది. నందినినగర్‌లో ఈ దుర్ఘటన జరిగింది.
నారాయణపేట జిల్లా ముక్తల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది. నందినినగర్‌లో ఈ దుర్ఘటన జరిగింది.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ మేడిపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి జరిగింది. ఆదివారం ఉదయం కొంతమంది ఆఫీసులోకి వచ్చి ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన క్యూస్ న్యూస్ సిబ్బంది వారితో వాదించారు. అది
సెల్ఫీ దిగుదాం అని భర్తను నదిలో తోసేసింది ఓ భార్య. బైక్ మీద వెళ్తుండగా కృష్ణానది సమీపానికి రాగానే కృష్ణా నది పరవళ్లతో ఫొటో తీసుకుందాం అంటూ బ్రిడ్జిపై ఆపిన భార్య.. సెల్ఫీ పేరుతో భర్తను అందులోకి తోసేసింది. అదృష్టవశాత్తు ఆయన బతికి బయటపడ్డాడు.
టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉన్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ నేత మానవతారాయ్ ముందస్తు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుని డిబెట్ కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. ఒక్కో ప్లేట్‌కి రూ.19 ఖర్చు అవుతుండగా ప్రజల నుంచి కేవలం రూ. 5 మాత్రమే తీసుకుంటారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. టికెట్ కోసం రేసులో10 మంది ఉన్నారు. ఆశావహులు అధిష్టానం వద్ద పైరవీలు మొదలుపెట్టారు. నవీన్ యాదవ్, అజారుద్దీన్, అర్జున్ గౌడ్, రోహిన్ రెడ్డి, కుసుమ్ కుమార్, ఫిరోజ్ ఖాన్, ఫహీమ్ ఖురేషీలతోపాటు పలువురు ఉన్నారు.