Telangana: ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్.. సజీవ దహనమైన 12 ఏళ్ల బాలిక

నారాయణపేట జిల్లా ముక్తల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఓ 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది. నందినినగర్‌లో ఈ దుర్ఘటన జరిగింది.

New Update
Death

Death

నారాయణపేట జిల్లా ముక్తల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఓ 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది. నందినినగర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే.. మృతి చెందిన బాలికకు కళ్లు కనిపించవు. మతిస్థిమితం లేదు. ఆమె తల్లిదండ్రులు రోజూవారి కూలీలు. 

Also Read: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్

ఎప్పట్లాగే పనులు నిమిత్తం బయటకు వెళ్లారు. దీంతో కళ్లు కనిపించని ఆ బాలిక వంటగదిలోకి వెళ్లింది. పొరపాటున అక్కడ ఉన్న ప్లగ్‌ వైర్లను లాగింది. ఈ క్రమంలోనే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. ఆ బాలికకు కళ్లు కనిపించకపోవడం, మతిస్థిమితం లేకపోవడం వల్ల తప్పించుకోలేక పోయింది. చివరికీ అక్కడే సజీవ దహనమైంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని మక్తల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Also Read: స్పెయిన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. వందల మందికిపైగా గల్లంతు

Advertisment
Advertisment
తాజా కథనాలు