TG Crime: సెల్ఫీ దిగుదామని భర్తను కృష్ణానదిలో తోసేసిన భార్య? భర్త చావకపోవడంతో కొత్త డ్రామా...

సెల్ఫీ దిగుదాం అని భర్తను నదిలో తోసేసింది ఓ భార్య. బైక్ మీద వెళ్తుండగా కృష్ణానది సమీపానికి రాగానే కృష్ణా నది పరవళ్లతో ఫొటో తీసుకుందాం అంటూ బ్రిడ్జిపై ఆపిన భార్య.. సెల్ఫీ పేరుతో భర్తను అందులోకి తోసేసింది. అదృష్టవశాత్తు ఆయన బతికి బయటపడ్డాడు.

New Update
Wife pushes husband into river to kill him

Wife pushes husband into river to kill him

TG Crime:

ఇటీవల కాలంలో భర్తలను చంపుతున్న భార్యల కేసులు రోజు ఏదో ఒకచోట వినపడుతూనే ఉన్నాయి. ఏదో ఒక రకంగా భర్తలను వదిలించుకోవడానికి భార్యలు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా సెల్ఫీ దిగుదాం అని భర్తను నదిలో తోసేసింది ఓ భార్య. బైక్ మీద వెళ్తుండగా కృష్ణానది సమీపానికి రాగానే కృష్ణా నది పరవళ్లతో ఫొటో తీసుకుందాం అంటూ బ్రిడ్జిపై ఆపిన భార్య.. సెల్ఫీ పేరుతో భర్తను అందులోకి తోసేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన తెలంగాణ, కర్ణాటక బార్డర్‌లో జరిగింది.  



కర్ణాటకలోని రాయచూరు జిల్లా శక్తి నగర్‌కు చెందిన తాతప్ప, ఆయన భార్యతో కలిసి బైక్ పై వెళుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం చేగుంట, రాయచూరు జిల్లాలోని కడ్లూరు మధ్య ఉన్న కృష్ణానది బ్రిడ్జి మీదుగా వెళుతున్నారు. ఈ క్రమంలో ‘రా బావ, ఇద్దరం సెల్ఫీ దిగుదాం’ అని భర్తను నది తీరానికి తీసుకెళ్లింది. బ్రిడ్జి అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో తీరం దగ్గరకు వెళ్లగానే.. తన భర్తను ఒక్కసారిగా నదిలోకి తోసేసింది.తాతప్ప కృష్ణానదిలో పడిపోయాడు. అతడికి ఈత కూడా రాకపోవడంతో ఆ ప్రవాహానికి కొట్టుకుపోతూ రక్షించాలని గట్టిగా కేకలు పెట్టాడు. మరోవైపు తనకేమీ తెలియనట్టు భర్తను కాపాడాలంటూ భార్య కేకలు వేసింది.తన బంధువులకు ఫోన్ చేసి భర్త నదిలో పడిపోయాడని చెప్పడం మొదలు పెట్టింది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న క్రమంలో తాతప్పకు నది మధ్యలో బండరాళ్లు దొరకడంతో దానిపైకి చేరాడు. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి పొడగాటి తాళ్లను నదిలోకి వేసి తాతప్పను సురక్షితంగా బయటకు తీశారు. భర్తను చంపాలనుకున్న తన ప్లాన్ బెడిసికొట్టడంతో భార్యకు నిరాశే మిగిలింది. ప్రమాదవశాత్తూ భర్త నదిలోకి పడిపోయాడని.. డ్రామాకు తెరలేపింది.

ఇది కూడా చదవండి:తలనొప్పి-నుదురులో తీవ్రమైన వ్యాధికి సంకేతాలు.. ఇవి తెలుసుకోండి

కాగా, నది నుంచి భయటకు వచ్చిన తాతప్ప తన భార్యే తనను చంపాలని నదిలోకి తోసిందని ఆరోపించాడు.సెల్ఫీ దిగుదామని బ్రిడ్జి అంచుకు తీసుకువచ్చి నది ప్రవాహంలోకి తోసివేసిందని ఆవేశంతో చెప్పడంతో పాటు ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడున్న వాళ్లు అడ్డుకున్నారు. ఆమె వద్ద ఉన్న తన ఫోన్ తీసుకుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి భార్యే నదిలోకి తోసేసిందని చెప్పాడు. అయితే ఆమె అతన్ని ఎందుకు చంపాలనుకుంది. ఇద్దరిమధ్య విభేధాలు ఏమన్న ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.కాగా అతన్ని కాపాడుతున్న వీడియో, అతను నదినుంచి భయటకు వచ్చిన తర్వాత భార్యే తనను చంపాలని చూసిందని ఆరోపిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. 

ఇది కూడా చదవండి:చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!

Advertisment
Advertisment
తాజా కథనాలు