/rtv/media/media_files/2025/07/11/tv-debate-2025-07-11-18-00-14.jpg)
TV Debate: రాబోయే తరాలకు మంచి నేర్పించాల్సిన నాయకులు బుద్ది తప్పుతున్నారు. కెమెరా ఉందన్న విషయం మరిచిపోయి బహిరంగగానే రెచ్చిపోతున్నారు. పరస్పర దాడులకు(Attack) దిగుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇటీవల ఓ టీవీ డిబెట్ సందర్భంగా ఇద్దరు నాయకలు ఒకరిపై మరోకరు దాడు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు
టీవీల్లో డిబేట్ కి వెళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద పెద్ద 90MM రాడ్లు పెట్టుకెళ్ళండి కాంగ్రెసోడు/బీజేపోడు ఎవ్వడన్నా కథల్ పడితే యేసుడే ఉండాలే... pic.twitter.com/EwgJeDFni2
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) July 8, 2025
చర్చ జరుగుతూ ఉండగా..
తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య జరిగిన సవాళ్ల పర్వంపై ఓ ప్రముఖ ఛానల్ టీవీ చర్చ నిర్వహిచింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీఆర్ఎస్ ఇతర పార్టీల నేతలను కూడా డిబేట్ కు పిలిచారు. ఈ క్రమంలో చర్చ జరుగుతూ ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటమాట పెరిగింది. దీంతో ముందుగా కాంగ్రెస్ నేత దేవని సతీష్.. బీఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ పై చేయి లేపారు. దీంతో కోపంతో ఊగిపోయిన గౌతమ్ .. సతీష్ పైకి దాడికి దిగాడు. దీంతో ఇరువురు ఎవరీ మాట వినకుండా ఒకరిపైకి మరోకరు దాడికి పాల్పడ్దారు.
Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
బీఆర్ఎస్ అంటే భయం పుట్టేలా చేసినం...
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) July 11, 2025
ఒరేయ్ మానవతారాయ్ తలకాయ పగులుద్దు అని హెల్మెట్ పెట్టుకున్నావ్..
మరి పుచ్చకాయ పగిలితే మాది బాధ్యత కాదు రోయి.. https://t.co/b4jPVYDaFopic.twitter.com/q4jLbCapHB
Also Read: BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్
ఈ ఎఫెక్ట్ మిగితా నాయకులపైన కూడా బాగానే పడింది. తాజాగా ఆదే ఛానల్ లో మరో డిబెట్ నిర్వహించగా.. కాంగ్రెస్ నేత మానవతారాయ్ ముందస్తు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుని డిబెట్ కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.