BIG BREAKING : MLC తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై దాడి

హైదరాబాద్‌ మేడిపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై దాడి జరిగింది. ఆదివారం ఉదయం కొంతమంది ఆఫీసులోకి వచ్చి ఫర్నీచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన క్యూస్ న్యూస్ సిబ్బంది వారితో వాదించారు. అది

author-image
By Krishna
New Update
mlc teenmar

హైదరాబాద్‌ లోని మేడిపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.  ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై దాడి జరిగింది. ఆదివారం ఉదయం కొంతమంది ఆఫీసులోకి వచ్చి ఫర్నీచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన క్యూ న్యూస్ సిబ్బంది వారితో వాదించారు. అది కాస్త ముదరడంతో క్యూ న్యూస్ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు. వారిని అదుపు చేయడానికి మల్లన్న గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరిపారు.  

Also Read :  మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 59 మంది పాలస్తీనీయులు మృతి

కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read :  బిహార్‌ ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్.. ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్, నేపాల్‌ పౌరులు

Also Read :  ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!

Also Read :  'మోనికా' పాటలో పూజతో స్టెప్పులేసిన ఈ నటుడు ఎవరు? సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్

Teenmar mallanna | hyderabad | telangana | mlc kavitha

Advertisment
Advertisment
తాజా కథనాలు