Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు మరోసారి కౌంటర్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్

ప్రకాశ్‌రాజ్‌ ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మరో కౌంటర్ వేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌ వీడియోను ఎక్స్‌లో రీట్వీట్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది అంటూ ప్రశ్నించారు.

New Update
Prakash raj Counters to Deputy CM Pawan kalyan

Prakash raj Counters to Deputy CM Pawan kalyan

హిందీ భాషపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ మధ్య వివాదం ముదురుతూనే ఉంది. ఇటీవల హిందీ భాష పెద్దమ్మ అంటూ పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ప్రకాశ్‌రాజ్‌ ఎక్స్‌లో ఆయనకు మరో కౌంటర్ వేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి అన్యాయం చేశారంటూ ఆయన విరుచుకుపడ్డారు. అయితే ఆ వీడియోను ప్రకాశ్‌రాజ్‌ తాజాగా రీట్వీట్ చేశారు.  ఈ ప్రశ్నలకు సమాధానం ఏది అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 

Also Read: హిందువుగా నటించి.. ఆన్‌లైన్‌లో 24 మంది అమ్మాయిల్ని ట్రాప్

ఇదిలాఉండగా ఇటీవల హిందీ భాషపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశవుతున్నాయి. 'మాతృభాష ఇంట్లో మాట్లాడుకోవడానికి సరిపోతుంది. ఇంటి సరిహద్దులు దాటితే మన రాజ్యభాష హిందీ' అని ఆయన మాట్లాడటం వివాదస్పదమైంది. దీనిపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ''ఈ రేంజ్‌కి అమ్ముడు పోవడమా.. ఛీ..ఛీ అంటూ'' ఎక్స్‌లో విమర్శించారు. అయితే ప్రకాశ్ రాజ్‌ కామెంట్స్‌పై తర్వాత జనసేన పార్టీకి చెందిన జనసేన శతగ్ని అనే సోషల్ మీడియా విభాగం కౌంటర్ ఇచ్చింది.

Also Read: వామ్మో.. ఎలుకలు 800 ఫుల్ బాటిళ్ల లిక్కర్‌ తాగాయా..!

అమ్ముడుపోవడం అంటే ఇది అంటూ ప్రకాశ్‌రాజ్‌ పాత వీడియోను షేర్ చేసింది. ''ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పు అంటే   నువ్వు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చెయ్యగలవా? ఈరోజు ఇలా అమ్ముడుపోయి మాట్లాడగలవా? అంటూ'' విమర్శించింది. ఇప్పుడు తాజాగా ప్రకాశ్‌రాజ్‌ మరోసారి పవన్‌కల్యాణ్‌కు కౌంటర్ ఇవ్వడం చర్చనీయమవుతోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు