/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
rains
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అలాగే గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Smartphone Offers: ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!
ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు
నేడు ఏపీ(Andhra Pradesh)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
తెలంగాణలో ఈ జిల్లాల్లో..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇది కూడా చూడండి:Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?
Break monsoon conditions causing terrible unusual heat in July. Few parts of Nalgonda, Suryapet, Khammam, Bhadradri - Kothagudem recording upto 38-40°C heat 🥵
— Telangana Weatherman (@balaji25_t) July 13, 2025
Respite ahead after July 16 with rains to pick up in Telangana, end of break monsoon 🌧️🌧️