Telangana: బైక్ దొంగతనం.. యువకుడికి నిప్పంటించిన గ్రామస్తులు
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బైక్ను దొంగిలించాడనే కారణంతో ఓ దొంగకు గ్రామస్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో అతడికి 90 శాతం గాయాలయ్యాయి.
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బైక్ను దొంగిలించాడనే కారణంతో ఓ దొంగకు గ్రామస్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో అతడికి 90 శాతం గాయాలయ్యాయి.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శపథం చేశారు. తెలంగాణ ప్రజల కన్నా బీహార్ ప్రజల్ని తక్కువ చేసి రేవంత్ రెడ్డి అవమానించారని ప్రశాంత్ కిశోర్ ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు.
తెలంగాణలో దసరా పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ఆ రోజున మద్యం అమ్మకాలు ఏరులై పారుతుంది. ఈ ఏడాది దసరాకు కూడా అంతే.. మాములుగా జరగలేదు.
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తాను పోటీ చేయనని చెప్పారు.తన భార్య నిర్మల బరిలో ఉంటారని చెప్పారు. తాను ఆమె వెనుక ఉండి నడిపిస్తానని అన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఏపీతో పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం వల్ల శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
తెలుగు నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన తాజా ట్వీట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎక్స్ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఏకంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్లో ఓ వ్యాపారి లక్కీ డ్రా పేరుతో కొన్ని ఆఫర్లు ప్రకటించాడు. రూ.150 చెల్లించి కూపన్ కొనుగోలు చేస్తే గెలిస్తే బహుమతులు ఇస్తానని తెలిపాడు. ఫస్ట్ గెలిచిన వారికి మేక, రెండో స్థానంలో కాటన్ బీర్లు, మూడో ప్లేస్ వారి ఫుల్ బాటిల్ ఇస్తారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.