/rtv/media/media_files/2025/09/24/coupons-2025-09-24-12-23-05.jpg)
coupons
కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారులు కొన్ని ఆఫర్లు పెడుతుంటారు. అందులోనూ పండుగ వస్తుంటే చాలు.. షాపులన్నీ ఆఫర్లు ప్రకటిస్తాయి. అయితే తెలంగాణలో పండుగ అంటే అందరికి ముందుగా గుర్తు వచ్చేది మందు, మాంసం. ఈ క్రమంలోనే దసరా సందర్భంగా ఓ వ్యాపారి కాస్త వింతగా ట్రై చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో ఓ వ్యాపారి లక్కీ డ్రా పేరుతో కొన్ని ఆఫర్లు ప్రకటించాడు. రూ.150 చెల్లించి కూపన్ కొనుగోలు చేస్తే గెలిస్తే బహుమతులు ఇస్తానని తెలిపాడు. ఫస్ట్ గెలిచిన వారికి మేక, రెండో స్థానంలో గెలిచిన వారికి ఒక కాటన్ బీర్లు, మూడో ప్లేస్‌లో గెలిచిన వారికి ఫుల్ బాటిల్, నాలుగో స్థానంలో గెలిచిన వారికి కోడి, ఐదో స్థానంలో గెలిచిన వారికి చీర బహుమతిగా ఇస్తానని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సూర్యాపేటలో హైటెన్షన్.. పోలీసులను పరిగెత్తించి కొట్టిన బీహార్ కార్మికులు!
క్యూపన్ కోసం ఎగబడుతున్న జనాలు..
దీంతో క్యూపన్స్ కొనడానికి జనాలు ఆ షాపుకు ఎగబడుతున్నారు. ఈ ఆఫర్ మందుబాబులకు బాగా ఉపయోగపడుతుంది. గతేడాది కూడా ఈ వ్యాపారి ఇలానే లక్కీ డ్రా నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ఇస్తున్నారు. అయితే చాలా వ్యాపారులు ఇలానే ఆలోచిస్తు్న్నారు. కొన్ని ప్రాంతాల్లో రూ.50కే టోకెన్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు ఎగబడి కొంటున్నారు. గతంలో పండుగ అంటే దుస్తులు వంటివి ఆఫర్లు పెట్టేవారు. కానీ ప్రస్తుతం మందు, మాంసం వంటి ఆఫర్లు పెడుతున్నారు. ఇది కొత్త రకం బిజినెస్ అని, బాగుందని పలువురు అంటున్నారు. కస్టమర్ల పాయింట్‌ను పట్టుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: Khammam Scam: ఖమ్మం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా...వాటి వెనుక ఉన్నదెవరంటే?