Dussehra Effect : దసరాకు తెగ తాగేశారు.. 10 నిమిషాలకో ఫుల్ బాటిల్ లేపేశారు.. లెక్కలివే!

తెలంగాణలో దసరా పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ఆ రోజున మద్యం అమ్మకాలు ఏరులై పారుతుంది. ఈ ఏడాది దసరాకు కూడా అంతే.. మాములుగా జరగలేదు.

New Update
dasara

తెలంగాణలో దసరా పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ఆ రోజున మద్యం అమ్మకాలు ఏరులై పారుతుంది. ఈ ఏడాది దసరాకు కూడా అంతే.. మాములుగా జరగలేదు. దసరాకు నాలుగు రోజుల ముందుగానే రూ.  800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు అంటున్నారు. దసరా రోజునే గాంధీ జయంతి కావడంతో మద్యం ప్రియులు ముందుగానే వైన్ షాపులకు భారీగానే క్యూ కట్టారు. 

2025 సెప్టెంబర్ 28వ తేదీన రూ. 200 కోట్లు,  29వ తేదీన రూ. 278 కోట్లు, సెప్టెంబర్ 30 వ తేదీన సుమారు రూ. 333 కోట్లు , అక్టోబర్ 1వ తేదీన సుమారు రూ. 86.23 కోట్లు సెల్స్ జరిగాయని అధికారులు అంటున్నారు. దసరా జోరుకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రావడంతో సెప్టెంబర్ లో ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం ప్రకారం  మొత్తం రూ. 3,046 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఐఎంఎల్ (లిక్కర్) సుమారు 29.92 లక్షలు,  బీర్ల కేసులు సుమారు 36.46 లక్షలు ఉన్నాయని అంటున్నారు.  రెస్టారెంట్లలో సగటున ప్రతి 10 నిమిషాలకు ఒక ఫుల్‌ బాటిల్‌, లేదా ఒక బీర్‌ బాటిల్‌ చొప్పున అమ్ముడుపోతుందని అంచనా.  

రంగారెడ్డి జిల్లా టాప్

గత ఏడాది సెప్టెంబర్ 2024తో పోలిస్తే, ఈ సెప్టెంబర్‌లో మద్యం అమ్మకాలు 7% పైగా పెరిగాయి. జిల్లాల వారీగా చూస్తే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (హైదరాబాద్ శివారు ప్రాంతాలు) అత్యధిక మద్యం విక్రయాలతో ముందు స్థానంలో ఉంది. గత ఏడాది దసరా సందర్భంగా మొత్తం 10 రోజుల్లో రూ.1,100 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్‌శాఖ అప్పట్లో వెల్లడించింది.  మద్యం విక్రయాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులలో ఒకటి. పండుగల సీజన్‌లో అమ్మకాలు భారీగా పెరగడం వలన ఎక్సైజ్ శాఖ అంచనాల కంటే ఎక్కువ ఆదాయాన్ని రాబట్టగలిగింది.

మటన్ షాపులు ఓపెన్ గానే

ఇక గాంధీ జయంతి సందర్భంగా గురువారం రోజున మటన్, చికెన్ షాపులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఆ  నిబంధన ఎక్కడా అమలు కాలేదు. చాలా చోట్ల మటన్ షాపులు ఓపెన్ గానే కనిపించాయి.  

Advertisment
తాజా కథనాలు