/rtv/media/media_files/2025/10/04/pk-with-revanth-reddy-2025-10-04-07-45-23.jpg)
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడిస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శపథం చేశారు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా రక్షించలేరని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల కన్నా బీహార్ ప్రజల్ని తక్కువ చేసి రేవంత్ రెడ్డి అవమానించారని ప్రశాంత్ కిశోర్ ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కన్నా బీహారీల డీఎన్‌ఏ నాసిరకమని రేవంత్ అంటున్నాడు. అదే నిజమైతే ‘సాయం చేయండంటూ నన్ను ఎందుకు అడుక్కున్నాడు? రాహుల్ గాంధీ కూడా ఆయనను కాపాడలేరు. ఆయనను ఎవరూ కాపాడలేరు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించి తీరతాను అని ప్రశాంత్ కిశోర్ హెచ్చరించారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి తనని గెలిపించమని ఆయన దగ్గరకు మూడుసార్లు వచ్చారని ప్రశాంత్ కిశోర్ గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఎంత గర్వం తలకెక్కిందంటే మా బీహారీలనే అవమానించారంటూ కిశోర్ ఫైర్ అయ్యారు. 2023 డిసెంబర్‌లో రేవంత్ రెడ్డి KCRపై తీవ్రస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే మా బీహర్ రూట్స్ ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని తిడతాడు
— Telangana Galam (@TelanganaGalam_) October 3, 2025
నేను బీహార్ నుండి వెళ్ళి మా బీహారీ కుటుంబం నడిపిస్తున్న కేసీఆర్ పార్టీని తెలంగాణలో గెలిపిస్తాను
కేసీఆర్ బీహారీ కాబట్టి కేసీఆర్‌కు హెల్ప్ చేస్తాను అని తేల్చి చెప్పిన ప్రశాంత్ కిషోర్.. pic.twitter.com/CIisHcJJwd
కేసీఆర్‌ది బీహార్ డీఎన్‌ఏ అంటూ ఆరోపణలు గుప్పించారు. తనది తెలంగాణ డీఎన్‌గా వర్ణించుకుంటూ, కేసీఆర్ కన్నా తానే ముఖ్యమంత్రి పదవికి అర్హుడినని, బీహార్ డీఎన్‌ఏ కన్నా తెలంగాణ డీఎన్‌ఏనే గొప్పదని రేవంత్ వ్యాఖ్యానించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. బీహార్ వాసి అయిన ప్రశాంత్ కిశోర్‌కు ఈ వ్యాఖ్యలు కోపాన్ని తెప్పించాయి. ఇవే వ్యాఖ్యలను ఆయన గుర్తుచేసుకుంటూ మా కన్నా మీ డీఎన్‌ఏ గొప్పదైతే సాయం కోసం మా దగ్గరకు ఎందుకు వచ్చావు అంటూ ఆయన రేవంత్ రెడ్డిని నిలదీశారు. రేవంత్ రెడ్డి BJP, టీడీపీ తర్వాత కాంగ్రెస్ పార్టీలు మారాడని ప్రశాంత్ కిశోర్ అన్నారు.