KCR, KTR చక్కదిద్దండి.. రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్స్

తెలుగు నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన తాజా ట్వీట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎక్స్ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు.  ఏకంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

New Update
kcr and ktr

తెలుగు నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన తాజా ట్వీట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎక్స్ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు.  ఏకంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు మాత్రమే విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్ మునిగిపోయింది. మీ వాగ్దానాలు అన్నీ విఫలమయ్యాయి. @KCRBRSPresident ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు, ప్రతిదాన్నీ క్రమబద్ధీకరించమండి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ 2 గంటల్లోనే 98,000కి పైగా వ్యూస్, 2,000 లైక్‌లు వచ్చాయి.ఈ  ట్వీట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు తెగ వైరల్ చేస్తున్నారు.

చాలా భయంకరమైన కాలంలో జీవిస్తున్నాం

అంతేకాకుండా రాహుల్ రామకృష్ణ మరో ట్వీట్ చేశారు. మనం చాలా భయంకరమైన కాలంలో జీవిస్తున్నాము. వేచి ఉండలేను.. వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని కేటీఆర్ ను కోరారు.  కేటీఆర్‌ను 'రక్షకుడిగా' పిలుస్తూ, "ఇప్పుడు నన్ను చంపేయండి, నాకు ఏమీ ఆశ లేదు" అని భావోద్వేగంగా ముగించాడు. ఈ పోస్ట్ 1.5 లక్షల వ్యూస్‌కు చేరింది. అయితే రాహుల్ ఈ ట్వీట్లు ఎందుకు చేశారన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి ఆయన చేసిన ఈ ట్వీట్లు సంచలనంగా మారాయి. 

రాహుల్ రామకృష్ణ ప్రధానంగా తన సహజమైన నటన,  హైదరాబాద్ యాస తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అర్జున్ రెడ్డి ఈ సినిమాలో హీరో విజయ్ కు ఫ్రెండ్ గా శివ పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందారు  రాహుల్ రామకృష్ణ. ఈ పాత్ర ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ తరువాత గీత గోవిందం, బ్రోచేవారెవరురా, జాతిరత్నాలు, ఆర్ఆర్ఆర్, ఓం భీమ్ బుష్ చిత్రాలలో నటించారు.  జాతీయ అవార్డు గెలుచుకున్న 'పెళ్ళిచూపులు' చిత్రానికి ఆయన రెండు పాటలు కూడా రాశారు. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా తన తొలి ప్రాజెక్టును ప్రకటించారు. ఆసక్తిగల నటీనటుల నుండి పోర్ట్‌ఫోలియోలను ఆహ్వానిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  

Advertisment
తాజా కథనాలు