/rtv/media/media_files/2025/10/05/coldrif-cough-syrup-2025-10-05-21-32-00.jpg)
Coldrif Cough Syrup
Coldrif Cough Syrup: మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాజిల్లాలో పిల్లల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సిరప్ వాడిన తర్వాత 11 మంది చిన్నారులు మరణించడంతో ప్రభుత్వ యంత్రాంగం సీరియస్ అయింది. ఈ ఘటనకు సంబంధించి సదరు మందును సూచించిన పీడియాట్రిషన్ డాక్టర్ ప్రవీణ్ సోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ సోనీ ప్రభుత్వ వైద్యుడే అయినప్పటికీ తన ప్రైవేట్ క్లినిక్‌లో పిల్లలకు ఈ కఫ్ సిరప్ వాడమని సూచించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. మరణించిన పిల్లల్లో ఎక్కువమంది సోనీ ప్రైవేట్ క్లినిక్‌లోనే చికిత్స పొందినట్లు అధికారులు దృవీకరించారు. ఈ కేసులో తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రీశాన్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీపై కూడా కేసు నమోదు చేశారు.
Also Read: మరో రెండ్రోజులు వణుకు పుట్టించే వెదర్.. ఈ 5 రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ
ఇదే కంపెనీ కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ తయారీదారు. నమూనాలను పరిశీలించిన అధికారులు, ఆ సిరప్‌లో 48.6 శాతం డైఇథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత విషపూరిత పదార్థం ఉన్నట్లు గుర్తించారు. దీనివల్లే పిల్లల కిడ్నీలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు తేల్చాయి. చెన్నై డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ఈ మందును “నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ”గా ప్రకటించింది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్ విక్రయాన్ని నిషేధించింది. అదనంగా, అదే కంపెనీ తయారు చేసిన నెక్ట్రో-డీఎస్ కఫ్ సిరప్ విక్రయాన్నీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ రెండు మందులపై మరిన్ని పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Also Read: EVMలలో ఇకనుంచి కలర్ ఫొటోలు.. ఈసీ కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం
దేశంలోని మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో చిన్నారుల వరుస మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ దగ్గు మందుపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. రాష్ట్రంలో కోల్డ్రిఫ్ సిరప్ వాడకంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానున్నట్టు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కోల్డ్రిఫ్ సిరప్ తాగడం వల్ల చిన్నారులు చనిపోయినట్లు నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
తమిళనాడు రాష్ట్రంలోని sresan ఫార్మా కంపెనీ ఈ ఈ కోల్డ్రిఫ్ సిరప్ ను తయారు చేసింది. ఈ కోల్డ్రిఫ్ సిరప్ తాగడం వల్ల రాజస్ధాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్నారుల పాలిట ప్రాణాపాయంగా పరిణమించిన ఈ దగ్గుమందును ఇకపై తెలంగాణ రాష్ట్రంలో నిషేదించినట్లు దీన్ని ప్రజలు వాడొద్దని.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
Also Read: నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలన్న ఎలాన్ మస్క్..మార్కెట్ విలువ పతనం