Weather Update: ముంచుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఏపీతో పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం వల్ల శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

New Update
rains

rains

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఏపీతో పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం వల్ల శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఈ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖకు 300 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం అయి ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే ఈ రోజే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరకోస్తాతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇది కూడా చూడండి: Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరో బిగ్ అలర్ట్.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ!

లోతట్టు ప్రాంతాల్లో..

ఇప్పటికే ఈ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేగంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే కొన్ని చెట్లు నేలకొరిగాయి. రహదారులు అన్ని పూర్తిగా జలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వైజాగ్‌లో చిన్న కాలనీలు మునిగాయి. చినవాల్తేరు, ఈస్ట్ పాయింట్, బీచ్ రోడ్డు దగ్గర నీరు అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే విశాఖ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 0891 2590 100, 0891 2590 102 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు వెల్లడించారు. 

తెలంగాణలో వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.

ఇది కూడా చూడండి: Dasara 2025: మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో ఘనంగా దసరా ఉత్సవాలు.. ఫొటోలు చూసేయండి!

Advertisment
తాజా కథనాలు