BIG BREAKING : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తాను పోటీ చేయనని చెప్పారు.తన భార్య నిర్మల బరిలో ఉంటారని చెప్పారు.  తాను ఆమె వెనుక ఉండి నడిపిస్తానని అన్నారు.

New Update
dasara

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తాను పోటీ చేయనని చెప్పారు.తన భార్య నిర్మల బరిలో ఉంటారని అన్నారు. తాను ఆమె వెనుక ఉండి నడిపిస్తానని అన్నారు. దసరా వేడుకల్లో జగ్గారెడ్డి ఈ కామెంట్స్ చేశారు. తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, మరో పదేళ్ల తరువాత తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు. మధ్యలో ఎవరైనా రావొచ్చన్నారు. ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ముందే తాను చెబుతున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం తన భార్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అని తెలిపారు. 

బీజేపీ నుంచి రాజకీయాల్లోకి 

బీజేపీ నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు జగ్గారెడ్డి. 2004లో టీఆర్ఎస్ లో చేరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 నుంచి 2014 మధ్య ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2014 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో 29,814 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2014లో లోక్‌సభ ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి టీఆర్ఎస్‌ చేతిలో ఓడిపోయారు.

మెదక్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన తరువాత 2015లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  2018 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ పై 2,522 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆయన ఓటమిపాలయ్యారు.  2021 జూన్ 28 నుండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ గా  కొనసాగుతున్నారు. జగ్గారెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో తనదైన ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందారు. 

జగ్గారెడ్డి-ఎ వార్‌ ఆఫ్‌ లవ్‌ 

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ అని సినిమా పేరు ఫిక్స్ అయ్యింది. స్వయంగా జగ్గారెడ్డే ఆ మూవీ పోస్టర్, అప్‌డేట్స్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అనుమతితోనే సినిమాల్లోకి వస్తున్నానని ఆయన స్ఫష్టం చేశారు. ఆయన క్యారెక్టర్‌కు తగ్గట్టుగా సినిమాలో పాత్ర ఉంటుందని రివీల్ చేశారు. ఇంటర్వెల్ ముందు నుంచి మూవీ చివరి వరకూ జగ్గారెడ్డి పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి సినిమా పోస్టర్‌లో ఆయన మాస్, ఫ్యాక్షన్ హీరో క్యారెక్టర్‌గా కత్తులతో కనిపిస్తున్నారు. బాలయ్య రేంజ్‌లో పోస్టర్ కటౌట్ ఉంది. జగ్గారెడ్డి నటిస్తున్న సినిమాలో లవ్ స్టోరీ ఉంటుందట. ఈ సినిమాకి వడ్డి రామానుజం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు