/rtv/media/media_files/2025/07/19/telnagana-rains-2025-07-19-07-06-54.jpg)
తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో అటు రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా ఉదయం నుంచి గ్యాప్ లేకుండా వర్షం కురుస్తోంది. అయితే మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. శని, ఆదివారాల్లో రాష్ట్రాల్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
Also Read : ప్రియురాలిని వశీకరణం చేసుకునేందుకు గోడ దూకాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఆ జిల్లాలకు అలెర్ట్
నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఈరోజు ,భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
Also Read : బంగ్లాదేశ్, పాకిస్థాన్ కొత్త వ్యూహం.. వీసా లేకుండానే రాకపోకలు
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు:
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని కోరారు.
#HyderabadRains#Hyderabad
— Hakku Initiative (@HakkuInitiative) July 26, 2025
📍Telangana Secretariat #Telangana#TelanganaRains
Stay safe Hyderabad. pic.twitter.com/e2x6RuWx73
Also Read : పెన్షన్ దారులకు గుడ్ న్యూస్...ఇక మీదట ఆ పనిచేయాల్సిన అవసరం లేదు
ప్రజలకు సూచనలు
వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితిలో తప్పా అనవసరంగా బయటికి వెళ్లవద్దని సూచించింది. అలాగే రోడ్లపై వెళ్ళేటప్పుడు విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే స్థానిక అధికారులను లేదా సహాయక బృందాలను సంప్రదించాలని తెలిపింది. అలాగే నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణించడం మానుకోవాలని సూచించింది.
Also Read: VISHWAMBHARA: 'విశ్వంభర' సెట్స్ నుంచి సాంగ్ లీక్.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలే!
latest-telugu-news | today-news-in-telugu | telangana news today | telangana-news-updates | telangana news live updates