/rtv/media/media_files/2025/07/01/eatela-rajender-bandi-sanjay-2025-07-01-14-36-22.jpg)
Eatela Rajender Bandi sanjay
బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచంద్రరావుకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ లక్ష్యాలను సాధించే బాధ్యత ప్రతీ ఒక్క కార్యకర్త, నాయకుల మీద ఉందన్నారు. రామచంద్ర రావు తన కన్నా పెద్దవారన్నారు. కానీ.. తనకు, ఆయనతో చాలా రోజుల నుంచి మంచి స్నేహం ఉందని గుర్తు చేసుకున్నారు. చదువుకునే సమయంలో విద్యార్థి సంఘాల్లో కలిసి పనిచేశామన్నారు. 35 ఏళ్లుగా ఆయన్ను దగ్గర నుంచి చూశామన్నారు.
Also Read : NTR జిల్లాలో దారుణం.. కొడుకును చెక్కతో కొట్టి చంపిన తండ్రి
Eatala Rajender First Reaction On BJP President Post
అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ ఎంపీ ఈటల రాజేందర్... కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ రామంచంద్రారావుకు శుభాకాంక్షలు తెలిపారు.#BJP pic.twitter.com/QKDIwvsb3g
— Telugu360 (@Telugu360) July 1, 2025
Also Read : మనిషి ఆయుష్షు 150-200 ఏళ్లు: బాబా రాందేవ్
సౌమ్యుడు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్త అని గుర్తు చేశారు. అనేక విషయాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రాంచంద్రరావు అని కొనియాడారు. శాసనమండలిలో తాము మంత్రులుగా ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఒక్కరే ఎమ్మెల్సీగా ఉన్నా.. ఆయన చాలా గొప్ప పాత్ర నిర్వహించాడన్నారు. కార్యకర్తల నమ్మకాన్ని నడిపించడంలో తప్పకుండా మందు భాగంలో ఉంటారని ఆకాంక్షించారు. తామంతా అందుకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.
ఈ రోజే మనందరి ఆమోదయోగ్యంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు (Naraparaju Ramchander Rao) గారికి శుభాకాంక్షలు....
Posted by Eatala Rajendar on Tuesday, July 1, 2025
Also Read : అనారోగ్యమా... అయితే మఖానా తినండి.. అది ఎందుకో తెలుసుకోవడానికి ఇప్పుడే చదవండి
Also Read : ఏపీ హోంమంత్రి అనితకు షాక్... ఏకంగా తన భోజనంలో బొద్దింక
latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates | breaking news in telugu