Telangana: అద్దంకి దయాకర్, జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు!

సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జిలను నియమించింది. అద్దంకి దయాకర్-కరీంనగర్, జగ్గారెడ్డి-హైదరాబాద్, పొన్నం-మెదక్, అడ్లూరి లక్ష్మణ్-వరంగల్, సంపత్ కుమార్ - నల్గొండ, కుసుమకుమార్ - మహబూబ్ నగర్ కు ఇన్ఛార్జిగా నియమించింది.

New Update
Revanth Reddy Addanki Dayakar Jaggareddy

పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ లను నియమించింది. వీరి ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లాల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ ఇన్ఛార్జిల వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read :  అఘోరీకి వెన్నుపోటు పొడిచిన శ్రీవర్షిణి.. న్యూ లుక్ చూశారా?

Also Read :  ప్రేమికుల సూసైడ్...పెద్దలు ఒప్పుకోలేదని బ్లేడ్ తో కోసుకుని..

  1. వంశీ చంద్ రెడ్డి - ఖమ్మం
  2. సంపత్ కుమార్ - నల్గొండ
  3. అడ్లూరి లక్ష్మణ్ - వరంగల్
  4. పొన్నం ప్రభాకర్ - మెదక్
  5. జగ్గారెడ్డి - హైదరాబాద్
  6. కుసుమకుమార్ - మహబూబ్ నగర్
  7. అనిల్ యాదవ్ - ఆదిలాబాద్
  8. అద్దంకిదయాకర్ - కరీంనగర్
  9. అజ్మత్ హుస్సేన్ - నిజామాబాద్
  10. శివసేనా రెడ్డి - రంగారెడ్డి 

Also Read :  జూబ్లీహిల్స్ లో బీజేపీదే గెలుపు.. ఆ పార్టీ చీఫ్ రామచందర్‌రావు చెప్పిన లాజిక్ ఇదే!

స్థానిక ఎన్నికల నేపథ్యంలో..

మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో సంస్థాగత నిర్మాణంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. కొత్త కమిటీల సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీంతో త్వరితగతిన గ్రామ స్థాయి నుంచి జిల్లా కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా నియమితులైన ఇన్ఛార్జిలు ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించనున్నారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ కొత్త కమిటీల ఏర్పాటుకు వీరు చర్యలు తీసుకోనున్నారు.

Also Read :  HYDలో గుండె పగిలే విషాదం.. కాలికి సర్జరీ.. గుండెపోటుతో బాలుడు మృతి

Aaddanki dayakar | telangana-politics | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news | telangana news today | telangana-news-updates

Advertisment
Advertisment
తాజా కథనాలు