/rtv/media/media_files/2025/02/12/A9fuEXTfXdgL6WKI5RQY.webp)
Etala Rajender:
తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు ఆ పార్టీలో చీలిక తెచ్చేలా ఉంది. గతకొన్ని రోజుల వరకూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి బీసీ లీడర్‌ను నియమిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఇప్పుడు రామచంద్రరావు పేరును పార్టీ ఖరారు చేసింది. ఈటల రాజేందర్ బీజేపీకి సారథ్యం వహిస్తారని గత కొన్నిరోజుల వరకూ ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీలోకి వచ్చినా.. కొన్నిరోజుల్లోనే ఈటలకు బీజేపీలో మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నారు. ఆయన కమలదళం అధిపతిగా తెలంగాణలో మారుతారని బీజేపీ పార్టీలో కొందరు కార్యకర్తలు కూడా భావించారు. అయితే ఆయనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అధిష్టానం. ఎంపీ ఈటల రాజేంద్రర్‌కు బీజేపీ పగ్గాలు అందినట్టే అంది.. చేజారిపోయాయి. బీజేపీ అధ్యక్ష బాధ్యతలకు ఈటలను రెండు అంశాలు దూరం చేసినట్లు చెప్పుకోవచ్చు.
Also Read : బరువును తగ్గించాలని తాపత్రయమా!! అయితే ఈ 30-30-30 ఫార్ములా ట్రై చేయండి
కాళేశ్వరం ప్రాజక్ట్‌పై ఆయన స్టేట్‌మెంట్
కాళేశ్వరం ప్రాజక్ట్ విచారణలో ఈటల రాజేందర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బీఆర్ఎస్ హయంలో ఈటల ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన మంత్రివర్గం అనుమతితోనే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని చెప్పారు. కాళేశ్వరం తెలంగాణకు నష్టం కాదని అన్నారు. 100 శాతం కాళేశ్వరం మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. బీజేపీ నాయకులు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రాజక్ట్ రాష్ట్రానికి భారం అని వాదిస్తున్నారు. వారికి విరుద్ధంగా ఈటల మాత్రమే ప్రాజెక్ట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పారు.
Also Read : మినీ స్కర్ట్ లో మీనాక్షి థై షో.. ఫొటోలు చూస్తే మతిపోతుంది!
కవిత బీజేపీపై చేసిన ఆరోపణలు
కేసీఆర్‌కు కవిత రాసిన లేఖలో ఆమెను అరెస్టైన సమయంలో పొత్తుకోసం బీజేపీ నాయకులు వచ్చారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కవిత కామెంట్స్‌తో ఆ ఆరోపణలకు బలం చేకూరింది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే, అది నిజమేనన్నట్లు అవుతుందని బీజేపీ అధిష్టానం ఆలోచించింది. దీంతో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించలేదు.
Also Read : కుమ్ముడే కుమ్ముడు..రూ.549కే VIVO 5జీ కొత్త స్మార్ట్‌ఫోన్!
Also Read : ప్రభాస్ "రాజా సాబ్" లో భారీ సర్ ప్రైజ్! ఐటమ్ నెంబర్ కోసం స్టార్ హీరోయిన్ రంగంలోకి
eetala-rajender | latest-telugu-news | brs | telangan | bjp | eetala-rajendar | latest telangana news | telangana news today | telangana-news-updates | today-news-in-telugu