BIG BREAKING : ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు ఊరట
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జెరూసలేం ముత్తయ్యకు ఊరట లభించింది. ఈ కేసులో ముత్తయ్యను తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జెరూసలేం ముత్తయ్యకు ఊరట లభించింది. ఈ కేసులో ముత్తయ్యను తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వాళ్ల ఆస్తులు అనుభవించే హక్కు పిల్లలకు ఉండదని తేల్చిచెప్పింది. తల్లిదండ్రులను ఇలా పట్టించుకొని పిల్లలను బయటకు కూడా వెళ్లగొట్టచ్చని స్పష్టం చేసింది.
ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే.దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పంట వ్యర్థాలు దహనం చేస్తున్న కొందరిని జైలుకు పంపిస్తేనే మిగతా వాళ్లకి వార్నింగ్ ఇచ్చినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది.
టపాసులపై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. కేవలం ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశమంతటా బ్యాన్ చేయాలని సూచించింది. కాలుష్యం ఒక్క ఢిల్లీ ప్రజలకే కాదు.. దేశంలో అనేక చోట్ల వాయు కాలుష్యం విపరీతంగా ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
పంజాబ్లో నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ కంగనా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ధర్మాసనం "మీరు ఆ ట్వీట్కు మసాలా జోడించారు" అంటూ కంగనాకు చివాట్లు పెట్టింది. రైతులు చేపట్టిన నిసరనలో ఆమె మహిళా రైతుని కించపరుస్తూ ట్వీట్ చేశారు.
తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీం కోర్టు సమర్థించింది.
సుప్రీంకోర్టు గుడ్న్యూస్ చెప్పింది. 2025 ఏడాదికి కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. గెజిటెడ్ పోస్టులైన ఈ ఉద్యోగాలు 30 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.67,700 జీతం ఉంటుంది.
దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలోనుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
సోషల్ మీడియాలో వికలాంగుల హక్కులపై అవగాహన కలిపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోకులు వేసే కమెడియన్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.