Karur Stampede: కరూర్‌ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

New Update
Supreme Court

Supreme Court

ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తుపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్‌ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసినట్లు పేర్కొంది. సెప్టెంబర్‌ 27న కరూర్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: మత్స్యకారులకు కాసుల వర్షం.. రూ.కోటికి అమ్ముడుపోయిన చేపలు

దీంతో ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం SIT దర్యాప్తునకు ఆదేశించింది. అయితే తమిళనాడు అధికారులు దర్యాప్తు చేయడంపై విజయ్ సహా మరికొందరు అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే దీనిపై విచారించిన జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజారియా ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. 

Advertisment
తాజా కథనాలు