Death Penalty: మరణశిక్ష విధించిన ఖైదీలకు ఉరిశిక్షనా ? లేదా ప్రాణాంతక ఇంజెక్షనా ?.. కేంద్రం కీలక ప్రకటన

మనదేశంలో మరణశిక్ష విధించిన ఖైదీలకు ఉరితీస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఉరిశిక్ష విధానాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది.

New Update
Centre disfavours lethal injection as mode of execution

Centre disfavours lethal injection as mode of execution

మనదేశంలో మరణశిక్ష విధించిన ఖైదీలకు ఉరితీస్తారన్న(death penalty) సంగతి తెలిసిందే. అయితే ఈ విధానాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు(Supreme Court) లో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిగింది. అయితే మరణశిక్షలో భాగంగా ఉరిశిక్ష విధానాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కాలానుగుణంగా మార్పులను తీసుకొచ్చేందుకు కేంద్రం రెడీగా లేకపోవడమే ఇక్కడ సమస్య అని పేర్కొంది.        

Also Read: నాశనమైపోతార్రా.. టూత్‌పేస్ట్, ఈనో కూడా కల్తీనేనా.. మీ ముఖాలు మండ!

Death Penalty - Supreme Court

సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా దీనిపై పిటిషన్ వేశారు. మరణశిక్ష పడ్డ ఖైదీకి ఉరితీయడమా ? లేదా ప్రాణాంతక ఇంజెక్షనా ? అనేది ఎంచుకునే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. అమెరికాలో 49 రాష్ట్రాల్లో మరణశిక్ష అమలు చేసే విధానంలో ప్రాణాంతక ఇంజెక్షన్ విధానాన్ని పాటిస్తున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల మరణశిక్ష సమయంలో శిక్ష అనుభవించబోయే నేరస్థుడికి తక్కువ వేదన ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైనట్లు స్పష్టం చేశారు.  

దీనిపై స్పందించిన ధర్మాసనం పిటిషనర్ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. దీనిపై స్పందించిన కేంద్రం.. పిటిషనర్‌ సూచన సాధ్యమయ్యేది కాదని ఇప్పటికే తమ కౌంటర్‌ అఫిడవిట్‌లో వివరించామని కేంద్రం తరఫు కౌన్సిల్‌ కోర్టుకు చెప్పారు. ఈ అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని గతంలో పరిశీలించామని కోర్టుకు చెప్పారు.  కేంద్రం ఇచ్చిన సమాధానంపై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 

Also Read: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. మోస్ట్ వాంటెడ్‌ మావోయిస్టు నేత రూపేష్ లొంగుబాటు

కాలం మారుతున్న కొద్ది ఎన్నో అంశాల్లో మార్పులు వచ్చాయని వ్యాఖ్యానించింది. కానీ ప్రభుత్వం మాత్రం మార్పులు స్వీకరించేందుకు రెడీగా లేదని.. ఇక్కడ ఇదే సమస్యగా మారిందని అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి విధానపరమైన ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. ఆ తర్వాత పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 11కి వాయిదా వేసింది. 

Advertisment
తాజా కథనాలు