/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు(BC Reservations Hike) పై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. హైకోర్టులో ఈ అంశంపై విచారణ పెండింగ్ లో ఉన్న సమయంలో ఇక్కడకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే.. కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో ఇక్కడికి వచ్చినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
Also Read : అల్లు అర్జున్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన ACP మృతి.. పోలీస్ శాఖలో విషాదం!
బ్రేకింగ్ న్యూస్
— Volga Times (@Volganews_) October 6, 2025
సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై ముగిసిన విచారణ
బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్‌కు తెలిపిన సుప్రీంకోర్టు
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు#bcreservation#LatestNews#SupremeCourtpic.twitter.com/k5sON57xa0
దీంతో తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్(ec) కు ఊరట లభించింది. ఈ నెల 8న ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. వరో వైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల పెంపు అంశంపై పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆశావహులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పోటీకి సిద్ధం కావాలా? వద్దా? అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. తొందరపడి ఖర్చు పెట్టిన తర్వాత న్యాయస్థానం ఎన్నికల ఆపాలని చెబితే ఎలా? అని ఆశావహులు భయపడుతున్నారు.
Also Read : తెలంగాణలో మరో దారుణం.. అలా చేస్తోందని అత్తను కొట్టి చంపిన కోడలు!
ఎల్లుండి బిగ్ డే..
సుప్రీంకోర్టు పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో ఇప్పుడు అందరి చూపు ఎల్లుండి హైకోర్టు విచారణపై పడింది. హైకోర్టు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆందోళన రాజకీయ నాయకులతో పాటు ఆశవహుల్లో కనిపిస్తోంది. ఎల్లుండి జరిగే విచారణలో న్యాయస్థానం ఎన్నికలు/బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్టే ఇస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఒక వేళ రిజర్వేషన్ల పెంపుకు నో చెబితే వెంటనే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మరో వైపు పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. గవర్నర్లు బిల్లులను మూడు నెలలకు పైగా పెండింగ్ లో ఉంచితే ఆమోదించినట్లుగానే పరిగణిస్తామని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో మరో 25 రోజులు ఆగితే ఆ బిల్లు గవర్నర్ కు పంపి 90 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో మరో 25 రోజులు ప్రభుత్వం ఆగొచ్చన్న ప్రచారం కూడా ఉంది. దీంతో ఎల్లుండి అంటే అక్టోబర్ 8.. తెలంగాణ పాలిటిక్స్ లో బిగ్ డే అన్న చర్చ సాగుతోంది.