/rtv/media/media_files/2025/10/10/sc-2025-10-10-17-34-11.jpg)
SC reserves order on pleas for nod to manufacture, sell green firecrackers in Delhi-NCR
శీతాకాలం ప్రారంభంలో ఢిల్లీ-NCR పరిధిలో వాయు కాలుష్యం(delhi-air-pollution) ఏటా తీవ్రంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో పలు రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీపావళి పండుగ(diwali)ను పర్యావరణహితమైన బాణసంచాతో జరుపుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరాయి. దీపావళి నాడు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు తమకు అనుమతి ఇవ్వాలని NCR రాష్ట్రాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
Also Read: నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై వైట్‌హౌస్ సంచలన రియాక్షన్
SC Reserves Order On Pleas For Nod To Manufacture
కొన్ని షరతుల ప్రకారం రాష్ట్రాల్లో బాణసంచా కాల్చుకునేందుకు పర్మిషన్ ఇవ్వొచ్చని తెలిపారు. జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ (NEERI) ఆమోదించిన పర్యావరణహిత(air-pollution) బాణసంచాను మాత్రమే తయారు చేసి, విక్రయించేలా సూచించాలని కోరారు. అత్యధికంగా పేలుడు వచ్చే బాణసంచా తయారు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఢిల్లీ సర్కార్ చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు.
Also Read: ట్రంప్ ను కాదని మరియా కొరీనా మచాడోకు నోబెల్.. ఆమె హక్కుల పోరాట ప్రస్థానమిదే!
అలాగే వ్యాపారులు పర్మిషన్ పొందిన టపాసులను మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇకామర్స్ వెబ్‌సైట్లు సైతం ఆన్‌లైన్‌లో టపాసాలు విక్రయించొద్దని సూచనలు చేశారు. అయితే పండుగ రోజున బాణసంచాను పూర్తిగా నిషేధించే ఆచరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. దీనివల్ల ప్రజల జీవనోపాధి, ఆచారాలు దెబ్బతింటాయని భావించింది. ఈ విషయంపై అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తుది నిర్ణయం మరికొన్ని రోజుల్లో వెలువరించనుంది. అయితే పండగు సందర్భంగా గ్రీన్ కాకర్లకు పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉందని, అలాగే దీనికి ఓ టైమ్‌ను కూడా విధిస్తామని కోర్టు మౌఖికంగా వెల్లడించింది.
Supreme Court today has reserved its verdict in a batch of petitions seeking permission to manufacture and sell "green" firecrackers in Delhi and National Capital Region.@AishwaryaIyer24
— LawBeat (@LawBeatInd) October 10, 2025
Read More: https://t.co/Be9nyZ8XwIpic.twitter.com/c8bP91RUai
Also Read: ఈ రంగాల వారికి బిగ్ షాక్.. హెచ్-1బీ వీసాల్లో మళ్లీ మార్పులు.. ఇక వెళ్లడం కష్టమే!