/rtv/media/media_files/2025/10/15/supreme-court-2025-10-15-14-01-11.jpg)
Supreme Court allows sale, use of green firecrackers in Delhi-NCR during Deepavali
ఢిల్లీ(delhi-ncr) లో పర్యావరణహితమైన గ్రీన్‌క్రాకర్స్(green firecrackers) వినియోగానికి పర్మిషన్ ఇవ్వాలని ఇటీవల పలువురు సుప్రీంకోర్టు(Supreme Court) ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీపావళి(Diwali 2025) కోసం పిల్లలు ఎదురుచూస్తున్నారని.. గ్రీన్ క్రాకర్స్‌తో వేడుక చేసుకునేందుకు అనుమతించాలని కోరారు. ఈ క్రమంలోనే దీనిపై విచారించిన అత్యన్నత న్యాయస్థానం వాటికి పర్మిషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. '' గ్రీన్‌కాకర్స్ కన్నా స్మగ్లింగ్ చేసిన బాణసంచాను వాడటం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. అందుకే పర్యావరణానికి హానీ కలగకుండా ఉండేందుకు గ్రీన్‌కాకర్స్‌ను మితంగా వాడేందుకు పర్మిషన్ ఇస్తున్నాం.
Also Read: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల లొంగుబాటు..ఆయన ఉద్యమ ప్రస్థానమిదే..
Supreme Court Allows sale Use Of Green Firecrackers
అక్టోబర్ 18 నుంచి 21 మధ్యే వీటిని కాల్చాలి. నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR)లోకి బయటి నుంచి ఎలాంటి బాణాసంచా తీసుకురావడానికి అనుమతి లేదు. కాలుష్య నియంత్రణ సంస్థల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఈ నివేదికను అధికారులకు సమర్పించాలని'' సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
Supreme Court allows bursting of green crackers for Diwali celebrations in Delhi.
— TIMES NOW (@TimesNow) October 15, 2025
I welcome the Supreme Court's order. I request the citizens of Delhi that, while celebrating Diwali, we ensure the use of green crackers in accordance with SC guidelines: @mssirsapic.twitter.com/MioU9i8SeN
Also Read: రాజస్థాన్ బస్సు ప్రమాదం.. 20కి చేరిన మృతుల సంఖ్య.. ఆకస్మిక మంటలకు కారణమిదే!
ఇదిలాఉండగా ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటుంది. దీంతో ఇక్కడ బాణాసంచాను విక్రయించేందుకు నిషేధిస్తూ గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీపావళి పండుగ సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రెండు గంటల పాటు పర్యావరణహితమైన బాణాసంచా(గ్రీన్‌కాకర్స్) కాల్చేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. చివరికి సుప్రీంకోర్టు దీనికి ఓకే చెప్పింది. మరోవైపు పేలుడు స్వభావమున్న క్రాకర్స్ తయారుచేయకుండా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే.
Also Read: 20కు చేరుకున్న జైసల్మేర్ బస్సు ఘోరం మృతుల సంఖ్య..మరో 16 మంది పరిస్థితి విషమం