Delhi: గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్..సిద్ధమవుతున్న ఢిల్లీ

దీపావళి వస్తోందంటే చాలు పాపం ఢిల్లీ విషాదంలో నిండిపోతుంది.  పండుగ చేసుకునే అవకాశం లేక ఢిల్లీ వాసులు మొర్రో అని ఏడుస్తారు. కానీ ఈ సారి గ్రీన్ క్రాకర్స్ తో దీపావళి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో అక్కడి ప్రభుత్వం చర్యలను చేపట్టింది. 

New Update
firecrackers111

ఢిల్లీ వాసులు అన్ని పండుగలు బాగానే చేసుకుంటారు. కానీ దీపావళి మాత్రం వాళ్ళకు ఉండదు. దీనికి కారణం అక్కడ కాలుష్యం. ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల్లో ఇదే టైమ్ లో నూర్పిడులు చేస్తారు. దాంతో ఢిల్లీకి విపరీతంగా దుమ్ము వస్తుంది. దానికి తోడు రాజధానిలో వాహన కాలుష్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడు బాణా సంచా కాలిస్తే పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుందని అక్కడి ప్రభుత్వం, సుప్రీంకోర్టు కూడా క్రాకర్స్ పై నిషేధం విధించింది. చాలా ఏళ్ళుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే ఈ సారి మాత్రం  ఇబ్బంది లేదని చెబుతున్నారు. 

గ్రీన్ క్రాకర్స్ అండ్ రూల్స్..

ఢిల్లీలో గ్రీన్ కాకర్స్ ను కాల్చుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఆకుపచ్చ బాణసంచా కాల్చడంపై నిషేధాన్ని ఎత్తివేయడంపై కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. దీంతో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా చర్యలను చేపట్టింది. దీనికి సంబంధించి సూచనలను జారీ చేసింది. దీనిపై ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రత్యేకంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యకు సహకరించ వలసిందిగా కోరారు. 

1. పండుగ కాలంలో ఉల్లంఘనలు,ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనుంది. 
2. మాములు బాణా సంచా అమ్మడంపై నిషేధం. దీన్ని పర్యవేక్షించడానికి అన్ని చోట్లా ఢిల్లీ కాలుష్య నియంత్ర కమిటీ, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలను నియమించింది. 
3. గ్రీన్ కాకర్స్ అమలును బలోపేతం చేయడానికి సమీర్ యాప్, ఢిల్లీ యాప్, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల ఏర్పాటు
4. గ్రీన్ క్రాకర్స్ పై ప్రచారం
5 కేవలం వారం రోజుల ముందు నుంచే గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు
6. దీపావళి ,గురుపురబ్ రోజులలో ఉదయం,సాయంత్రం కనీసం ఒక గంట పాటు మాత్రమే క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతి.

Also Read: Gaza Peace Plan: మొదటి దశ అయింది..చీ ఫో అంది..గాజా శాంతి ప్రణాళికకు హమాస్ నో

Advertisment
తాజా కథనాలు