CJI BR Gavai: సుప్రీం కోర్టులో హై టెన్షన్.. న్యాయవాది CJIపై చెప్పులు విసిరేందుకు యత్నం!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై సోమవారం దాడికి యత్నం కలకలం రేపింది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై చెప్పులు విసిరేందుకు కొందరు న్యాయవాదులు ప్రయత్నించారు. తోటి లాయర్లు వారిని అడ్డుకున్నారు.

New Update
supreme court cji br gavai

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు(Supreme Court) లో ప్రధాన న్యాయమూర్తిపై సోమవారం దాడికి యత్నం కలకలం రేపింది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌(Justice BR Gavai CJI) పై చెప్పులు విసిరేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించారు. తోటి లాయర్లు, సీజేఐ భద్రతా సిబ్బంది ఆయన్ని అడ్డుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారిస్తుండగా.. న్యాయవాది డయాస్ వద్దకు వెళ్లి ఆయనపై విసిరేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ న్యాయవాదిని బయటకు తీసుకెళ్లారు. CJI సనాతన ధర్మాన్ని అవమానించారని సదరు న్యాయవాది నినాదాలు చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడున్నవారికి షాకింగ్‌కు గురి చేసింది. పోలీసులు ఆ న్యాయవాదిని అరెస్ట్ చేశారు. ఇలాంటి వాటికి తాను భయపడనని సీజేఐ చెప్పుకొచ్చారు. తర్వాత కేసుల విచారణ కొనసాగించారు.

Also Read :  ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది పర్వతారోహకులు

Lawyers Tried To Attack On CJI BR Gavai

Also Read :  నేడే జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్.. 4 గంటలకు ఈసీ ప్రెస్ మీట్!

కోర్టు హాలులో ఇంత పెద్ద ఘటన జరిగినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సంయమనం కోల్పోకుండా, చాలా ప్రశాంతంగా స్పందించారు. తోటి న్యాయమూర్తులను ఉద్దేశిస్తూ... "ఇలాంటి వాటిని పట్టించుకోకండి. మనం మన దృష్టిని మరల్చకూడదు. ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు" అని అన్నారు. ఆ తర్వాత యథావిధిగా కోర్టు కార్యకలాపాలను కొనసాగించారు.

ఈ దాడి యత్నం వెనుక అసలు ఉద్దేశం ఏంటనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే,విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసంకు సంబంధించిన ఒక కేసు చుట్టూ ఈ వ్యవహారం ముడిపడి ఉందని ప్రాథమికంగా తెలుస్తోంది. ఖజురహో ఆలయ సముదాయంలో విష్ణుమూర్తి విగ్రహ పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా దుమారం చెలరేగింది. 

Advertisment
తాజా కథనాలు