CJI: 'షాక్ అయిపోయా'.. షూ దాడిపై తొలిసారిగా స్పందించిన సీజేఐ బీఆర్‌ గవాయ్

తనపై జరిగిన దాడిపై తాజాగా సీజేఐ బీఆర్ గవాయ్ స్పందించారు. ఆరోజు జరిగింది చూసి షాక్ అయిపోయానని అన్నారు. అలాగే ఆ ఘటనను 'మర్చిపోయిన ఛాప్టర్‌'గా అభివర్ణించారు.

New Update
‘I was very shocked’, CJI BR Gavai responds to ‘shoe attack’ amid outrage

‘I was very shocked’, CJI BR Gavai responds to ‘shoe attack’ amid outrage

ఇటీవల సుప్రీంకోర్టు(Supreme Court) లో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్‌ గవాయ్‌(cji br gavai attack) పై రాకేష్ కిషోర్ అనే లాయర్‌ తన షూ విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర వివాదం చెలరేగింది. ఈ దాడిని అనేకమంది ఖండించారు. అయితే తనపై జరిగిన దాడిపై తాజాగా సీజేఐ బీఆర్ గవాయ్ స్పందించారు. ఆరోజు జరిగింది చూసి షాక్ అయిపోయానని అన్నారు. అలాగే ఆ ఘటనను 'మర్చిపోయిన ఛాప్టర్‌'గా అభివర్ణించారు. '' సోమవారం జరిగిన ఘటనపై నేను, నా తోటి న్యాయమూర్తి సోదరుడు షాక్ అయ్యాం. ఇది మాకు మర్చిపోయిన అధ్యాయం'' అని తెలిపారు. 

Also Read: అమ్మతోడు.. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం.. తేజస్వి యాదవ్ సంచలన హామీ

CJI BR Gavai Responds To ‘Shoe Attack’

మరోవైపు సీజేఐపై షూ విసిరిన లాయర్‌ రాకేష్‌ కిషోర్‌(71)ను సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్ బహిష్కరించింది. అలాగే ఆయన భవిష్యత్తులో మళ్లీ కోర్టులో అడుగుపెట్టకుండా ఎంట్రీ కార్డును రద్దు చేశామని గురువారం అధికారికంగా ప్రకటన చేసింది. అక్టోబర్ 6న సుప్రీంకోర్టులోని కోర్ట్‌ నెంబర్‌ 1 హాల్‌లో విచారణ జరగుతున్న సమయంలో రాకేష్‌ కిషోర్‌ కోపంతో తన షూ తీసి సీజేఐ వైపు విసిరాడు. కానీ అది ధర్మాసనం దాకా వెళ్లలేదు. దీంతో తోటి లాయర్లు అతడిని పట్టుకొని కోర్టు సిబ్బందికి అప్పగించారు. ఆ ఘటన జరిగిన తర్వాత కూడా సీజేఐ జస్టిస్ గవాయ్‌ కోర్టు కార్యకలాపాలు కొనసాగించారు.   

ఆ దాడి చేసేటప్పుడు రాకేష్ కిషోర్‌ సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించం అంటూ నినాదాలు చేశారు. విష్ణు మూర్తిపై సీజేఐ అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని అందుకే తాను ఈ దాడి చేసినట్లు పోలీసులు విచారణలో పేర్కొన్నారు. 3 గంటల విచారణ తర్వాత పోలీసులు అతడిని వదిలేశారు. దీంతో సుప్రీంకోర్టు బార్‌ అసోషియేషన్ ముందుగా రాకేష్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: పాకిస్థాన్‌కు దిమ్మతిరిగేలా ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ మెనూ.

 కానీ ఇంతలోనే గురువారం అతడిని బహిష్కరిస్తున్నట్లు బార్‌ అసోషియేషన్ ప్రకటించింది. ఈ దాడిని మాత్రం రాకేష్ కిషోర్‌ సమర్థించుకున్నారు. ఇదంతా దైవ నిర్ణయమని పేర్కొన్నారు. అయితే తన నుంచి కనీస వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడాన్ని మాత్రం తప్పుబట్టారు. మరోవైపు బెంగళూరులో కూడా లాయర్ రాకేష్‌పై కేసు నమోదైంది. ఆయన CJI పై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఆల్‌ ఇండియా అడ్వొకేట్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు భక్తవత్సల ఫిర్యాదు చేశారు. 

Also Read: మోదీకి చిరాకు తెప్పిస్తున్న చిరాగ్..కూటమి పని ఖతమేనా?

Advertisment
తాజా కథనాలు