/rtv/media/media_files/2025/01/13/qa5pGQkwOLDni36JJ4k2.jpg)
CM Revanth
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. ఇది 50% రిజర్వేషన్ల పరిమితిని దాటుతుందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. నిన్న సుధీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు మరోసారి వాదనలు వింది. ఈ కేసులో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు, ప్రభుత్వ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. విచారణ అనంతరం జీవో నెంబర్ 09 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. దీంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) October 9, 2025
బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే
బీసీలకు 42% రిజర్వేషన్లను జీవో నెంబర్ 9లో ఇచ్చిన ప్రభుత్వం
జీవో నెంబర్ 9పై స్టే విధించిన హైకోర్టు
ఈ జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం
దీనిపై కౌంటర్ దాఖలు… pic.twitter.com/OkWobSvVuK
Also Read : తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు సంచలన నిర్ణయం!
రేవంత్ సర్కార్ కు బిగ్ షాక్
కాగా ఈ వ్యవహారంపై హైకోర్టులో రెండు రోజులపాటు సుదీర్ఘ వాదనలు సాగాయి. ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుతోనే ఎన్నికలకు వెళ్లాలని భావించిన రేవంత్ సర్కార్ కు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ఈ క్రమంలో తదుపరి ఏం చేయాలనేదానిపై సీఎం రేవంత్ ప్రభుత్వ తరుపు లాయర్లతో భేటీ కానున్నారు. హైకోర్టు స్టే పై లాయర్లతో చర్చించిన అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.కోర్టు నిర్ణయానికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులు వెలువడ్డ తర్వాత పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read : ఈటలను ఉద్దేశించి బండి సంజయ్ సంచలన కామెంట్స్!