Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. మహిళా మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఇతర సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.