Pahalgam Attack: పహల్గామ్ అటాక్ లో చనిపోయిన మృతుల వివరాలు వెల్లడి..
కాశ్మీర్ లోని పహల్గామ్ లోని ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో 16 మందిని పోలీసులు గుర్తించారు. వారి వివరాలను ప్రకటించారు. మరో పది మంది క్షతగాత్రుల వివరాలను కూడా పోలీసులు తెలిపారు.
కాశ్మీర్ లోని పహల్గామ్ లోని ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో 16 మందిని పోలీసులు గుర్తించారు. వారి వివరాలను ప్రకటించారు. మరో పది మంది క్షతగాత్రుల వివరాలను కూడా పోలీసులు తెలిపారు.
మెదక్‌లో మరో దారుణం జరిగింది. నామాపూర్‌లో మద్యానికిబానిసై వేధిస్తున్న జోగయ్యను భార్య నాగమ్మ తన కూతురి సాయంతో చంపేసింది. కూతురు కాళ్లు పట్టుకోగా నాగమ్మ గొంతుకు చీర చుట్టి కడతేర్చింది. నాగమ్మపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేరళలో మరో భయంకరమైన మర్డర్ జరిగింది. వయనాడ్‌లో జిల్సన్ అనే వ్యక్తి తన భార్య లీషాను ఛార్జింగ్ కేబుల్‌తో గొంతుకోసి చంపేశాడు. అనంతరం తమ ఇద్దరు పిల్లలను ఒక గదిలో బంధించి అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మూఢనమ్మకాల పిచ్చితో కన్న బిడ్డనే బలిచ్చిన తల్లికి కోర్టు ఉరిశిక్ష విధించింది. సూర్యపేట మేకలపాటితండాకు చెందిన బానోతు భారతి ఆనారోగ్యం బారిన పడింది. దీంతో 2021లో జ్యోతిష్కుడి మాటలు నమ్మి తన 7 నెలల కూతురి గొంతు, నాలుక కోసి చంపింది.
శాలిగౌరారం మూసీ వాగులో దొరికిన యువతి డెడ్ బాడీ జనగామ జిల్లా పడమటి తండా మహేశ్వరిగా గుర్తించారు. మహేశ్వరికి కట్నం కింద కోటి రూపాయల ఇళ్లు ఇస్తానని తండ్రి ఒప్పుకున్నాడు. కానీ ఆ ఆస్తి తనకే దక్కాలని ఆమెను చంపినట్లు సవతి తల్లి లతిత ఒప్పుకోగా అరెస్టు చేశారు.
ఏపీ కడపలో మరో దారుణ మర్డర్ జరిగింది. అంబవరంకు చెందిన చెన్నకేశవ తన భార్య సుజాతను నరికి చంపాడు. అనంతరం అతను రైలు కిందపడి చనిపోయాడు. కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తుండగా.. ఈ ఘనటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రోషన్ తెలిపారు.
అమెరికాలో మరో దారుణం జరిగింది. భర్తతో విడాకుల కారణంగా 11 ఏళ్ల బాలుడిని గొంతుకోసి చంపింది భారత సంతతికి చెందిన సరితా రామరాజు. బిడ్డను తండ్రికి అప్పగించాలని కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కుక్కలకున్న విశ్వాసం మనుషులకు ఉండదు అంటారు. అది నిజమేనని నిరూపించింది అమెరికాలోని అలిసన్ లారెన్స్ అనే ఆమె. పత్రాలు లేక కుక్కను ఫ్లైట్ లో తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పారని ఏకంగా దాన్నే చంపేసింది ఫ్లైట్ ఎక్కేసింది.
ఏపీ మండపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సురేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న కూతురు దుర్గను.. తండ్రి రాంబాబు మందలించాడు. వెంటనే మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో ప్రియుడు, అతని ఫ్రెండ్ తో కలిసి తండ్రిని గొంతు పిసికి చంపింది. ముగ్గురిని అరెస్ట్ చేశారు.