/rtv/media/media_files/2025/12/25/fotojet-8-2025-12-25-21-45-34.jpg)
Honor killing
Crime News :కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పరువు హత్య కలకలం సృష్టించింది. కేసు వివరాలను హుజూరాబాద్ ఏసీపీ మాధవి మీడియా సమావేశంలో వెల్లడించారు. మండలంలోని శివరామ్ పల్లి గ్రామానికి చెందిన బాలిక ఇటీవల చనిపోయింది. కడుపునొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఈనెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇది పరువు హత్యగా తేల్చారు.
పోలీసుల కథనం ప్రకారం.. శివరామ్ పల్లి గ్రామానికి చెందిన బాధితురాలు ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే గ్రామా నికి చెందిన ఒక యువకుడితో ఆమె ప్రేమలో పడింది. అయితే, ఆ యువకుడికి అప్పటికే వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పలుమార్లు కూతురిని మందలించారు. వివాహితుడితో సంబంధం పెట్టుకోవడం వల్ల కుటుంబ గౌరవం పోతుందని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినప్పటికీ బాధితురాలి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో..ఆమెను అడ్డు తొలగించుకోవాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
గత నెల 14వ తేదీన ఇంట్లో గొడవ జరగడంతో.. ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఆపై ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీశారు. అనంతరం ఏమీ తెలియనట్టుగా.. తన కూతురు కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రులే దోషులని తేల్చి వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Follow Us