Mahabubabad: నువ్వేం తల్లివి...భర్త మీద అనుమానంతో ఇద్దరు పిల్లలను చంపిన మహిళ

ప్రస్తుత రోజుల్లో మానవ బంధాలు చాలా తేలిక అయిపోయాయి. తల్లి లేదు, కొడుకు లేదు, భర్త లేదు, భార్య లేదు..ఎవరిని పడితే వారినే చంపేసుకుంటున్నారు. తాజాగా మహబూాబాాబాద్ జిల్లాలో భర్త మీద అనుమానంతో క్ష తల్లి తన ఇద్దరు కొడుకులను పీక పిసికి చంపేసింది. 

New Update

చిన్న పిల్లలు అంటే మామూలుగా ఎవరికీ ద్వేషం ఉండదు. అభం శుభం వయసులోని పిల్లలు...ముద్దు ముద్దు మాటలతో, బుడిబుడి నడకలతో ఉన్న వారిని చూస్తే ఎవరికైనా ముద్దే వస్తుంది. పొరపాటున కూడా వారికి హాని చేయాలన్న తలంపే రాదు. కానీ మహబూబ్ నగర్ లో ఓ కన్నతల్లి మాత్రం తాను ఓ అమ్మను అని మార్చిపోవడమే కాదు...అవతలి వారు చిన్న పిల్లలు అన్న విషయం కూడా మర్చిపోయింది. భర్త మీద అనుమానం పెనుభూతమై కన్న పిల్లలే కాని వారయ్యారు.  ముందు ఒక కొడుకును మట్టుబెట్టింది. తాజాగా మరో కొడుకును ఐరి వేసి మరీ చంపేసింది. 

తొమ్మిది నెలల తేడాలో ఇద్దరు కొడుకులను...

మహబూాబాాబాద్  జిల్లా జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అక్కడ విషాదం నింపేసింది. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష అనే అమ్మ తన ఐదేళ్ళ కొడుకును దారుణంగా నైలాన్ తాడుతో గొంతు పిసికి మరీ చంపేసింది. సెప్టెంబర్ 24న ఈ సంఘటన జరిగింది. దీనిని పోలీసులు ఒక్క రోజులోపునే ఛేదించారు. విచారణ తర్వాత తానే కొడుకు చంపానని ఒప్పుకోవడంతో శిరీషను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

తరువాత దర్యాప్తులో ఇద్దరు కొడుకులను తానే చంపానని ఒప్పుకుంది శిరీష. భర్త మీద అనుమానంతోనే అలా చేశానని చెప్పింది. భర్త తాగుడుకు బానిసై తననూ, పిల్లలూ పట్టించుకోవడం లేదని...దాంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని చెప్పింది. అందుకే ముందు పిల్లలిద్దరినీ చంపేశారనని తెలిపింది. తాతను లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అనే భయంతోనే ఇదంతా చేశానని శిరీష విచారణలో చెప్పింది. 

విచారణలో శిరీష పోలీసులకు మరో షాకింగ్ విషయం కూడా చెప్పింది. అంతకు ముందు జనవరిలో చిన్న కొడుకును కూడా తానే చంపానని ఒప్పుకుంది.  సంప్ లో పడేసి మునిగేటట్టు చేశానని చెప్పింది. అప్పుడే పెద్ద కొడుకును కూడా చంపాలనుకున్నానని...కానీ వాడు తప్పించుకున్నాడని తెలిపింది. అందుకే ఇప్పుడు పెద్దవాడిని మట్టుబెట్టానని వివరించింది.  తాను చనిపోవాలనుకోవడమే పెద్ద తప్పు అయితే పిల్లలిద్దరినీ చంపేయడం మరో దారుణమని పోలీసులు అంటున్నారు. భర్త పట్టించుకోకపోతే...పిల్లలిద్దరినీ తానే పెంచుకోవచ్చని...అలా చేయకుండా వారిని చంపేయడం అమానుషమని అంటున్నారు. మానవత్వానికే ఇది పెద్ద మచ్చని చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు