/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
AP Vizianagaram Daughter kills mother for love marriage
AP Crime: ఏపీలో మరో దారుణం జరిగింది. ప్రియుడిపై మోజుతో ఓ కూతురు తన కన్న తల్లినే కడతేర్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించిన యువతి.. ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె అంగీకరించలేదు. దీంతో కొంతకాలంగా ఎలాగైనా ఆమె అడ్డు తొలిగించుకోవాలని భావించిన ప్రియులు.. పక్కా ప్లాన్ తో ఆమెను చంపేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటించగా బంధువుల ఫిర్యాదుతో అసలు బాగోతం బయటపడింది. ఈ ఘోరమైన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
అతనితో పెళ్లి వొద్దన్నందుకే..
ఈ మేరకు శృంగవరపుకోట మండలం వెంకటరమణపేటకు చెందిన లక్ష్మి కూతురు రుచితతో జీవిస్తోంది. అయితే రుచిత కొంతకాలంగా హరికృష్ణ అనే యువకుడిని ప్రేమిస్తోంది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలి ఫిక్స్ అయ్యారు. ఈ విషయం రుచిత తన తల్లి లక్ష్మికి చెప్పింది. కానీ ఆమె ఇందుకు నో చెప్పింది. దీంతో లక్ష్మిపై పగ పెంచుకున్న రుచిత, హరికృష్ణ ఆమెను అత్యంత దారుణంగా హతమార్చారు.
Also Read: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!
రాత్రి టాయిలెట్ వస్తుందని తల్లిని ఆరు బటయకు తీసుకెళ్లింది రుచిత.. అక్కడికి ఆటోలో వచ్చిన హరికృష్ణ.. రుచితతో కలిసి లక్ష్మిని కిడ్నాప్ చేశారు. గ్రామ శివారులో మెడకు బండరాయి కట్టి బావిలో నెట్టేశారు. ఏమీ తెలియనట్లే ఇంటికి వెళ్లిపోయారు. అయితే మరుసటి రోజు మధ్యా్హ్నం. బావిలో వెంకట లక్ష్మి శవమై తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే లక్ష్మి అనుమానస్పద మృతిపై బంధువులు ఫిర్యాదు చేయగా రుచిత, హరికృష్ణ కలిసి చంపినట్లు అనుమానిస్తున్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Also Read: ఐదేండ్ల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర
Follow Us