HCA: పర్యవేక్షణ బాధ్యత జస్టిస్ నవీన్ రావుకు అప్పగించిన హైకోర్టు

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్‌ నవీన్‌రావుకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన అనుమతి లేకుండా ఏదీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. 

New Update
HCA

Hyderabad Cricket Association

హెచ్ సీఏ వ్యవహారాల పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావును తెలంగాణ హైకోర్టు నియమించింది. నవీన్ రావు అనుమతి లేకుండా ఏది చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.   2007 నుంచి హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై సీబీఐ తో విచారణ జరిపించాలని సఫిల్ గూడా క్రికెట్ క్లబ్ పిటిషన్ వేసింది. ఈ కేసు విషయంలో ఇప్పటికే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావు అరెస్ట్ అయ్యారు. తాజాగా ప్రధాన కార్యదర్శి దేవరాజ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో పాటూ ఈనెల 19న జరిగిన 87వ ఏజీఎం కొనసాగింపును పిటిషనర్  తప్పుబటారు.  ⁠10 రోజుల నోటీసు సమయం లేకుండా ఏజీఎం నిర్వహించారని ఆక్షేపించారు. ఈ కేసులో ప్రతివాదులుగా CBI, BCCI, HCA ను  సఫిల్ గూడా క్రికెట్ క్లబ్ చేర్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు హెచ్సీఏ పర్యవేక్షణ బాధ్యతలను నవీన్ రావుకు అప్పగించింది. అలాగే వచ్చే ⁠సోమవారం ఈ కేసుపై హైకోర్టు  పూర్తిస్థాయి విచారణ చేపట్టనుంది. 

సీబీఐ విచారణ..

అంతకు ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావును  సీఐడీ అధికారులు కస్టడీకి కోరారు. ఈ మేరకు మల్కాజ్‌గిరి కోర్టు లో పిటిషన్‌ వేయగా కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. ఇప్పటికే అరెస్ట్‌ అయి చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను జూలై 17 నుంచి జూలై 21 వరకు సీఐడీ కస్టడీలో ఉంచేందుకు కోర్టు అనుమతిచ్చింది. అదే సమయంలో విచారణ దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించింది.  

Advertisment
తాజా కథనాలు