/rtv/media/media_files/2025/06/29/addte-2025-06-29-12-23-19.jpg)
Hyderabad: హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA)లో మరో కుంభకోణం బయటపడింది. సర్వసభ్య సమావేశానికి(AGM) ముందే 136 క్లబ్‌లకు ఒక్కో దానికి రూ.3 లక్షల చొప్పున రూ.4 కోట్ల రూపాయల మొత్తాన్ని పంచడం సంచలనం రేపుతోంది. క్లబ్‌ల అభివృద్ధి కోసం ఈ నిధులను ఇచ్చినట్లు హెచ్‌సీఏ పెద్దలు చెబుతుండగా చెల్లింపులు జరిగిన తీరు అనుమానాలకు దారితీస్తోంది.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
ఈ మేరకు సర్వసభ్య సమావేశంలో క్లబ్‌ల నుంచి వ్యతిరేక గళాలు వినిపించకుండా చూడడంతో పాటు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ప్రయోజనం పొందడం కోసమే ఈ చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావుతో పాటు ఇతర ఆఫీస్ బేరర్లు ఈ వ్యవహారం నడిపించినట్లు సమాచారం. కాగా దీనిపై విచారణ జరపాలని తెలంగాణ అవినీతి నిరోధక విభాగం అధికారులకు ఫిర్యాదు అందింది. కార్యదర్శి దేవరాజ్ ఆమోదం లేకుండానే ఆయన సంతకం పెట్టని చెల్లింపులు పూర్తి చేయడం చర్చనీయాంశమైంది.
Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు