/rtv/media/media_files/2025/07/11/hca-ed-2025-07-11-15-15-19.jpg)
Enforcement Directorate
Enforcement Directorate: HCA వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ అయింది. దీనిపై ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు ఇవ్వాలని సీఐడీని కోరింది. సీఐడీ నుంచి వివరాలు రాగానే ఈడీ కేసు నమోదు చేయనుంది. HCA అవినీతి కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రమేయం ఇదివరకే ఉంది. HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు వ్యవహారంతో పాటుగా బీసీసీఐ నిధుల దుర్వినియోగంపై ఈడీ విచారణ చేపట్టింది. HCA నిధుల దుర్వినియోగంపై ED గతంలోనే దర్యాప్తు ప్రారంభించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కేటాయించిన నిధులు, సామగ్రి కొనుగోలులో జరిగిన అవకతవకలపై ED విచారణ చేపట్టింది.
Also Read: BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్
మల్కాజ్‌గిరి కోర్టు రిమాండ్
ఇక ఇప్పటికే HCA అక్రమాల్లో అరెస్టైన జగన్మోహన్ రావుతో పాటుగా మరో ఐదుగురికి 12 రోజుల పాటు మల్కాజ్‌గిరి కోర్టు రిమాండ్ విధించింది . నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఇక ఇదే ఈ కేసులో A6గా ఉన్న మహిళా నిందితురాలు కవితను చంచల్ గూడా మహిళ జైలుకు పోలీసులు తరలించారు.
Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
ఇదిలాఉండగా గత ఐపీఎల్ మ్యాచ్‌లో SRH, HCA మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ సందర్భంగా టికెట్స్ ఇవ్వలేదని కార్పొరేట్ బాక్స్‌కు HCA తాళం వేసింది. దీంతో హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని SRH యాజమాన్యం తెలిపింది. దీనిపై విజిలెన్స్ విచారణకు రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు.. SRH యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి, ఇబ్బంది పెట్టినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు.10 శాతం టికెట్లను SRH.. HCAకు ఫ్రీగా ఇవ్వగా మరో 10 శాతం టికెట్లు ఇవ్వాలని యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు.
Also Read: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు
అయితే ఫ్రీగా 10 శాతం టికెట్లు ఇచ్చేది లేదని SRH యాజమాన్యం చెప్పగా.. ఒపెన్ మార్కెట్ కోనుగోలు చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. అలాగే తనకు వ్యక్తిగతంగా 10 శాతం టికెట్లు కావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కానీ వ్యక్తిగతంగా ఇచ్చేందుకు SRH ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రావు.. SRH యాజమాన్యాన్ని ఒత్తిడికి గురి చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయన్ని తాజాగా అరెస్టు చేశారు.
Also Read: BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్