/rtv/media/media_files/2025/10/09/tilak-varma-2025-10-09-10-21-42.jpg)
Tilak Varma
ఆసియా కప్‌లో సంచలనం సృష్టించిన యువ ఆటగాడు తిలక్ వర్మ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టును నడిపించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న తిలక్ వర్మను తిరిగి కెప్టెన్‌గా నియమిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ రంజీ ట్రోఫీ అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో హెచ్‌సీఏ జట్టును కూడా ప్రకటించింది. అయితే టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ ఈ రంజీ ట్రోఫీకి దూరంగా ఉండనున్నాడు. త్వరలో రాబోతున్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే హైదరాబాద్ జట్టులో ఈసారి సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, హిమ తేజ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, నిశాంత్, అనికేత్ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్ రాదేశ్ వంటి ఆటగాళ్లను తీసుకున్నారు. అయితే ఈ రంజీ ట్రోఫీ అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌కు తిలక్ వర్మ దూరం కానున్నాడు. తిలక్ వర్మ ఆస్ట్రేలియా పర్యటనలో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. దీంతో రెండో మ్యా్చ్ నుంచి ఆడనున్నాడు.
ఇది కూడా చూడండి: Australian Cricket : . ఆస్ట్రేలియాను వదిలేయండి... చెరో రూ.58 కోట్లు ఇస్తాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీ బంపరాఫర్!
హైదరాబాద్ రంజీ టీమ్ మొదటి మ్యాచ్ కోసం..
తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), సి.వి. మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరథ్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ కాక్, అలీ కాచి డైమండ్ (వికెట్ కీపర్), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్).
స్టాండ్‌బైలు
నితేష్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షన్ రెడ్డి, నితేష్ కనాలా, మిఖిల్ జైస్వాల్.
హైదరాబాద్ రంజీ టీమ్
తిలక్ వర్మ(కెప్టెన్), రాహుల్ సింగ్(వైస్ కెప్టెన్), సి.వి. మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరథ్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ కాక్, అలీ కాచి డైమండ్ (వికెట్ కీపర్), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్).
ఇది కూడా చూడండి: Chahal Dhana shree: రెండో నెలకే నన్ను మోసం చేశాడు.. ధనశ్రీ ఆరోపణలపై చాహల్ బహిరంగ ప్రకటన