HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం .. రాచకొండ సీపీకి ఫిర్యాదు!

హైదరాబాద్‌ క్రికెట్ ఆసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం సృష్టించాయి.  HCAపై పలువురు ప్లేయర్స్ రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.

New Update
hca

హైదరాబాద్‌ క్రికెట్ ఆసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం సృష్టించాయి.  HCAపై పలువురు ప్లేయర్స్ రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.  అండర్ 16, అండర్ 19,అండర్ 23 లీగ్ మ్యాచుల్లో ఆడేందుకు పలువురు ప్లేయర్లు ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేశారన్న ఫిర్యాదు అందింది. నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్ లోఎక్కువ వయసు ఉన్న ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తున్నారని తమ ఫిర్యాదులో  వెల్లడించారు. 

గతంలో ఆరుగురు ప్లేయర్స్ ను గుర్తించిన బీసీసీఐ వారిపై బ్యాన్ విధించింది. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగ్ లో అడే విధంగా HCA అవకాశమిస్తు్ందన్న ఆరోపణలున్నాయి. దీనివల్ల టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం వాటిల్లితుందని తమ ఫిర్యాదులో వెల్లడించారు. అవినీతికి పాల్పడి టాలెంట్ లేకున్నా ప్లేయర్స్ ను   ఆడిస్తున్న HCA అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాచకొండ సీపీకి ఇచ్చిన  ఫిర్యాదులో వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Gold Rates: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

భారీ స్థాయిలో ఆర్థిక అక్రమాలు

మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో భారీ స్థాయిలో ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. HCAకు బీసీసీఐ (BCCI) ద్వారా వచ్చిన సుమారు రూ. 200 కోట్లకు పైగా నిధులను కొద్ది కాలంలోనే దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాత ఆడిట్లలో కూడా గతంలో అక్రమాలు జరిగినట్లు తేలింది. 

క్రికెట్ బంతులు, ఎలక్ట్రానిక్ సామగ్రి, క్రీడాకారుల వస్త్రాలు కొనుగోలు చేసినట్లు తప్పుడు లెక్కలు చూపించి కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టించినట్లు తేలింది. హైదరాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అధికారులను HCA పెద్దలు ఉచిత టిక్కెట్లు, కార్పొరేట్ బాక్సుల కోసం బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. టిక్కెట్లు ఇవ్వకపోతే మ్యాచ్ నిర్వహణకు సహకరించబోమని బ్లాక్ మెయిల్ చేయడంతో, ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా CID కేసు నమోదు చేసింది.

ఇది కూడా చూడండి: BSNL Recharge Plan: రూ.99లకే బీఎస్‌ఎన్‌ఎల్ బంపరాఫర్.. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు అదిరిపోయే ప్లాన్స్

Advertisment
తాజా కథనాలు