Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. వాళ్లకు వీసాలు బంద్
హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి గాజా ప్రజలకు వీసాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి గాజా ప్రజలకు వీసాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇజ్రాయెల్ గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా చేసుకుంది. అక్కడి స్థానిక మీడియా ఈ విషయాలు వెల్లడించింది. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు దశలవారీగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని పేర్కొంది.
హమాస్ వద్ద ఇజ్రాయెల్ బందీలు.. ఇజ్రాయెల్ వద్ద హమాస్ బందీలు ఉన్నారు. అయితే తమ వద్ద నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ బందీల పరిస్థితిపై హమాస్ కొన్ని వీడియోలు విడుదల చేసింది.
గాజాలో పెరుగుతున్న ఆకలి మరణాలపై ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కాస్త దిగొచ్చింది. పాక్షిక కాల్పుల విరమణను ప్రకటించింది.
హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో అధినేత యాహ్యా సిన్వార్ గతేడాది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సిన్వార్ మృతి తర్వాత భార్య సమర్ మహమ్మద్ అబూ జమర్ తన పిల్లలతో కలిసి ఓ నకిలీ పాస్‌పోర్టు ద్వారా టర్కీకి పారిపోయి అక్కడ మరో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో 94 మంది మృతి చెందారు. గాజా ఆరోగ్యశాఖ గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. మానవతా సాయం అందిస్తున్న పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన కాల్పుల్లోనే 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ముగించి సంధి కుదుర్చుకోవాలని తన సోషల్ మీడియా అయిన ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రస్తుతం హమాస్‌తో చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
గాజాలోని రఫాలో 'గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్' కేంద్రం వద్ద జరిగిన కాల్పులకు తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ కాల్పులు జరిపిందని పేర్కొంది. దీనికి సంబంధించి డ్రోన్ వీడియోను కూడా విడుదల చేసింది.