/rtv/media/media_files/2026/03/03/houthis-2026-03-03-15-05-40.jpg)
శ్చిమాసియా రాజకీయాల్లో ఇరాన్ తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో పలు సాయుధ, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై యుద్ధానికి దిగడంతో ఇరాన్ తన "యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్" ద్వారా ప్రతీకార దాడులకు ప్లాన్ చేస్తోంది. ఇరాన్ ఇప్పటి వరకు పెంచి పోషించిన మిలిటెంట్ గ్రూప్‌లను ఈ యుద్ధంలో వాడుకుంటోంది. ప్లానింగ్ ప్రకారం ఇరాన్ ఆయా సంస్థలకు ఫండింగ్, ట్రైనింగ్ ఇస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఈ ప్రైవేట్ ఆర్మీ సంస్థలు విరుచుకుపడుతున్నాయి. ఈ గ్రూపులు చెల్లాచెదురుగా ఉండటంతో వీటిని పూర్తిగా నిర్మూలించడం అగ్రరాజ్యాలకు పెద్ద సవాలుగా మారింది. ఓ పక్క ఇరాన్ ఆర్మీ, మరో పక్క హిజ్బుల్లా, హమాస్, హూతీలతో ప్రాక్సీ యుద్ధాలు చేస్తోంది. ఇరాన్ తన సొంత భూభాగం నుండి కాకుండా, ఈ 'ప్రాక్సీ' గ్రూపుల ద్వారా ప్రత్యర్థులపై దాడులు చేస్తూ పశ్చిమాసియాలో తన పట్టును నిలుపుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఈ సంస్థలను ఉగ్రవాద గ్రూపులుగా గుర్తించి ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇరాన్ పెంచి పోషిస్తున్న ప్రాక్సీ గ్రూపులు
1. హిజ్బుల్లా (లెబనాన్)
ఇరాన్ అత్యంత సన్నిహితంగా, పవర్‌ఫుల్ సపోర్ట్ ఇచ్చే సంస్థ హిజ్బుల్లా. లెబనాన్ కేంద్రంగా పనిచేసే ఈ షియా మిలిటెంట్ గ్రూపునకు ఇరాన్ ఏటా వందల మిలియన్ల డాలర్ల నిధులు, అత్యాధునిక క్షిపణులు, శిక్షణను అందిస్తుంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ ప్రయోగించే ప్రధాన అస్త్రం ఇదే.
2. హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (గాజా)
గాజాలో ఇజ్రాయెల్‌తో పోరాడుతున్న హమాస్, ఇస్లామిక్ జిహాద్ సంస్థలకు ఇరాన్ ఆర్థిక, సైనిక సహాయాన్ని అందిస్తోంది. ఈ గ్రూపులు సున్నీ విభాగానికి చెందినవైనప్పటికీ, ఇజ్రాయెల్ వ్యతిరేకత అనే ఉమ్మడి లక్ష్యంతో ఇరాన్‌తో చేతులు కలిపాయి.
3. హూతీ తిరుగుబాటుదారులు (యెమెన్)
యెమెన్‌లో పట్టు సాధించిన హూతీలకు ఇరాన్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల టెక్నాలజీ సప్లై చేస్తోంది. ఇటీవల ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తూ అంతర్జాతీయ వాణిజ్యానికి హూతీలు పెద్ద సవాలుగా మారారు. వీరు ఇరాన్ ప్రయోజనాల కోసం సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తుంటారు.
4. ఇరాకీ షియా మిలిషియా గ్రూపులు
ఇరాక్‌లో 'పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్'లోని కతైబ్ హిజ్బుల్లా, హరకత్ అల్-నుజాబా వంటి అనేక గ్రూపులు ఇరాన్ కనుసన్నల్లో పనిచేస్తాయి. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయడంలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
5. ఇతర ప్రాంతీయ గ్రూపులు
సిరియాలోని బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పలు విదేశీ షియా మిలిషియా గ్రూపులతో పాటు, బహ్రెయిన్ మరియు పాకిస్థాన్ (జైనబియాన్ బ్రిగేడ్), ఆఫ్ఘనిస్థాన్ (ఫాతిమియాన్ డివిజన్) వంటి దేశాల్లోని షియా యువకులను ఇరాన్ తన సైనిక అవసరాల కోసం వాడుకుంటోంది.
Follow Us